ఆరేళ్ల లవ్ తర్వాత పెళ్లి అంటే.. ఎన్ కౌంటర్ చేస్తానంటున్నాడట!

Update: 2020-09-27 06:30 GMT
అతడో ఆర్మీ జవాను. డిఫెన్సులో పని చేసే వారంతా బాధ్యతగా ఉంటారనే భావనకు భిన్నంగా ఉంటుందీ యువకుడి వ్యవహారం. అతడి వ్యవహారశైలి ఇప్పుడు వివాదంగా మారటమే కాదు.. అతగాడికి చిక్కులు తప్పేటట్లు లేవు. ఆరేళ్లుగా ప్రేమించుకొని.. శారీరంగా వాడుకొన్న తర్వాత పెళ్లి అంటే అతగాడి నోటి నుంచి వచ్చిన మాటలకు షాక్ తిందా యువతి. తనను ప్రేమించిన వ్యక్తి.. తాజాగా బెదిరిస్తున్న వైనంపై నిప్పులు చెరుగుతోంది బాధితురాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో చోటు చేసుకున్న మౌనపోరాటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కార్తీక్ అనే ఆర్మీ జవాను తమ బంధువైన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆరేళ్లుగా ప్రేమించుకున్న వారు.. శారీరకంగా దగ్గరయ్యారు. ఇంతకాలం ఎంచక్కా తిరిగారు. తీరా.. పెళ్లి చేసుకుందామని అడిగిన ఆ యువతికి తన సమాధానంతో షాకిచ్చాడు కార్తీక్. తనను పెళ్లి చేసుకోమని అడుగుతున్న తర్వాత నుంచి తప్పించుకు తిరుగుతున్నట్లుగా సదరు యువతి ఆరోపిస్తోంది.

తాను ఎన్ కౌంటర్ స్పెషలిస్టునని.. ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరిస్తున్నాడట. అంతేకాదు.. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదన్న అతడి మాటలతో బిత్తరపోయిన బాధితురాలు ప్రస్తుతం మౌనపోరాటానికి దిగింది. తనను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన ఆమె దీక్ష ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. ప్రియుడిగా అభివర్ణిస్తున్న కార్తీక్ వాదన ఏమిటన్నది బయటకు రావాల్సి ఉంది.
Tags:    

Similar News