జ‌గ‌నే నేర‌స్తుడు.. మిగిలిన వారేమైనా స్పెష‌లా: చంద్ర‌బాబు

ఏసీ అసెంబ్లీ లో శుక్ర‌వారం మాట్లాడిన సీఎం.. ఇటీవ‌ల వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ చేసిన రెండు ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లపై త‌న‌దైన శైలిలో సెటైర్లు పేల్చారు.;

Update: 2026-02-13 15:11 GMT

``జ‌గ‌నే నేర‌స్తుడు.. మిగిలిన వారేమైనా స్పెష‌లా`` అని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఏసీ అసెంబ్లీ లో శుక్ర‌వారం మాట్లాడిన సీఎం.. ఇటీవ‌ల వైసీపీ అధినేత‌ జ‌గ‌న్ చేసిన రెండు ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లపై త‌న‌దైన శైలిలో సెటైర్లు పేల్చారు. ఇదేస‌మ‌యంలో తీవ్ర ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. వైసీపీ నాయ‌కు లు, కార్య‌క‌ర్త‌ల‌కు నేరాలు చేయ‌డం అల‌వాటుగా మారింద‌న్నారు. ``రాజకీయాల ముసుగులో నేతలే నేరాలు చేస్తే.. వారి ప‌రివారం మాత్రం మౌనంగా ఉంటుందా?`` అని బాబు ప్ర‌శ్నించారు.

తాడేప‌ల్లి ప్యాలెస్ నుంచి గుంటూరుకు(అంబ‌టి రాంబాబు నివాసానికి) వెళ్లేందుకు గ‌ట్టి అర‌గంట స‌రిపో తుంద‌ని.. కానీ.. ఆరు గంట‌ల పాటు జాత‌ర‌గా వెళ్లార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. అదేవిధంగా తాడేప ల్లి ప్యాలెస్ నుంచి విజ‌య‌వాడ శివారులో ఉన్న ఇబ్రహీంప‌ట్నాన్ని చేరుకునేందుకు( మాజీ మంత్రి జోగి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు) కూడా 20 నుంచి 30 నిమిషాల స‌మ‌యం స‌రిపోతుంద‌న్నారు. కానీ, ఇక్క‌డ కూడా మ‌హా జాత‌ర‌ను త‌ల‌పించారన్నారు.

దీనివ‌ల్ల ట్రాఫిక్ జామ్‌లు పెరిగిపోయి.. ప్ర‌జ‌లు భ‌య భ్రాంతుల‌కు గుర‌వుతున్నార‌ని.. సీఎం చంద్ర‌బాబు తెలిపారు. జ‌గ‌న్ రోడ్డుపైకి వస్తున్నాడంటే ఏం జరుగుతుందోనని ప్ర‌జలు భ‌యంతో అల్లాడి పోతున్నార‌ని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా దౌర్జన్యం, రోడ్డంతా బ్లాక్‌ చేయడం జ‌గ‌న్‌కు, ఆయ‌న ప‌రివారానికి అల‌వాటుగా మారింద‌న్నారు. జాతీయ ర‌హ‌దారులు ఎవ‌రి సొంత జేబులో సొమ్ముతోనూ క‌ట్టిన‌వి కావ‌ని.. ప్ర‌జ‌ల సొమ్ముల‌తో నిర్మించార‌ని..అలాంటి వాటిపై ప్ర‌జ‌ల‌కు సైతం దారి లేకుండా చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

మాట్లాడ‌కూడ‌ద‌నే అనుకున్నా..

తాను తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై మాట్లాడ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. అయితే.. త‌న‌ను ప‌దేప‌దే వైసీపీ నాయ‌కులు రెచ్చ‌గొడుతున్నార‌ని.. స్వామి వారి ప‌విత్ర‌త‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. అందుకే.. తాను మాట్లాడాల్సి వ‌స్తోంద‌న్నారు. స్వామి విషయంలో తెలిసి కానీ.. తెలియక కానీ తప్పు చేయనన్నారు. ఇక‌, పెరుగు క‌ల్తీ అంటూ.. హెరిటేజ్‌పై చేస్తున్న యాగీ కార‌ణంగా.. ఈసంస్థ బ్రాండ్ దెబ్బ‌తీయాల‌నే కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు.

Tags:    

Similar News