• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భారత ప్రధాని కేరాఫ్ సేవా...

భారత ప్రధాని కేరాఫ్ సేవా తీర్థ్

| ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అడ్రస్ మారింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ నుంచి ఈ రోజు (శుక్రవారం) సేవాతీర్థ్ కు మారింది.

By - Garuda Media
Update: 2026-02-13 15:30 GMT

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అడ్రస్ మారింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ నుంచి ఈ రోజు (శుక్రవారం) సేవాతీర్థ్ కు మారింది. 1931లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన సౌత్ బ్లాక్ రాష్ట్రపతి భవన్ పక్కనే ఉన్న రైసినా హిల్ ప్రాంతంలో ఉండేది. ఇప్పటివరకు ఇక్కడి నుంచే ప్రధానమంత్రులు పని చేసేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త హంగులతో పార్లమెంట్ భవనంతో పాటు ఇతర ప్రభుత్వ పాలనా భవనాల్ని నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని సైతం మారుస్తున్నారు.

ఈ కొత్త భవనాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీన్ని సేవా తీర్థ్ గా పిలుస్తారు. ఇంతకాలం పీఎంవో, జాతీయ భద్రతా మండలి కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్ లు ఇప్పుడు ఒకే ప్రాంగణంలోకి వస్తున్నాయి. ఈ భవనం ఎయిర్ ఫోర్స్ ఆఫీసు పక్కనే ఉంటుంది. ఒకే భవనంలో కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సెల్ తో పాటు క్యాబినెట్ సెక్రటేరియట్ ఒకే భవనంలో అందుబాటులోకి రావటంతో పాలనాపరంగా మరింత వేగంగా నిర్ణయాలకు వీలువుతుంది. సేవా తీర్థ్ లో మొత్తం మూడుగా ఉన్నాయి. దీన్ని అత్యాధునిక గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీతో నిర్మించారు.

ఈ భవనంలో వినియోగించే విద్యుత్ ను సోలార్ పవర్ తో పని చేసేలా సాంకేతికతను ఏర్పాటు చేశారు. నీటి పొదుపుతో పాటు.. చెత్తను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు ఉంటాయి. దీంతో పర్యావరణాన్ని కాపాడటంతోపాటు.. విద్యుత్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈ భవనాల్లోని మరో ముఖ్యమైన అంశం ఫైల్స్.. పేపర్ అన్నది లేకుండా అంతా డిజిటల్ గా షేర్ చేసుకోవచ్చు. దీంతో పారదర్శకత మరింత పెరుగుతుంది. స్మార్ట్ లాక్స్.. కెమెరాలు.. అత్యవసర అతారమ్ లు ఉన్నాయి. దీంతో భవనంలోకి ఎవరు.. ఎప్పుడు వచ్చారు? ఎక్కడకు వెళ్లారు లాంటివి ఇట్టే తెలుస్తాయి. దీంతో.. భద్రతాపరమైన సమస్యలు తగ్గుతాయి. అత్యాధునిక సాంకేతికతను వినియోగించటం ద్వారా పాలనాపరమైన మార్పులకు.. వేగానికి దోహదం చేస్తుంది.

Tags:    
  • pmo 
  • sevateerth 
  • centralvista 
  • narendramodi 
  • southblock 
  • newpmo 
  • digitalindia 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS