కరోనా హాస్పిటల్ లో లవ్ స్టోరీ .. అచ్చం సినిమా తరహాలో ..

Update: 2020-07-28 04:45 GMT
రోనా వచ్చి హాస్పిటల్ లో చావుబ్రతుకుల మధ్య ఉంటే , ఈ హాస్పిటల్ లో లవ్ స్టోరీ ఏంటి ? అని ఆలోచిస్తున్నారా ?నిజమే ప్రేమకి వయస్సు , సమాయంతో అవసరం లేదు అని చాలామంది చెప్తుంటారు. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు అది హాస్పిటల్ అయితే ఏమిటి .. స్కూల్ అయితే ఏమిటి ..ఇంకొకటి అయితే ఏమిటి. అలాగే వీరి మధ్య కరోనా హాస్పిటల్ ప్రేమ చిగురించింది. కరోనా ను జయించి బయటకి రాగానే పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. సినిమా తరహా ప్రేమకథలలా ఉన్న ఈ సంఘటన గుంటూరు లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు చూస్తే .. ప్రకాశం జిల్లా పర్చూరు ప్రాంతానికి చెందిన యువకుడు, గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతికి కరోనా పాజిటివ్ తేలడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. వారికీ పక్క, పక్కనే బెడ్లు వచ్చాయి. ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.  మనసులు కలిశాయి.  ప్రేమగా మారింది. ఆ ప్రేమ బలంతో కరోనాను జయించారు. అబ్బాయి హైదరాబాద్‌ లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ లో ఇంజనీర్‌. అమ్మాయి కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. అంతేకాదు ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒకటే. కరోనా నుంచి కోలుకోవడంతో మళ్లీ టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే తమ ప్రేమకథను తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి ఈనెల 25 వ తేదీ న పొన్నూరు లోని ఆంజనేయ స్వామి దేవాలయం లో కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహం చేసుకున్నారు.
Tags:    

Similar News