ప్రపంచంలో అత్యంత అందమైన పురుషులు ఉన్న దేశాలివే.. ఇండియా స్థానం ఎంతంటే?

అందం.. అమ్మాయిల విషయంలోనే కాదు అబ్బాయిల విషయంలో కూడా ప్రథమ ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-12 09:30 GMT

అందం.. అమ్మాయిల విషయంలోనే కాదు అబ్బాయిల విషయంలో కూడా ప్రథమ ప్రాధాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే. ఈ అందం అనేది ఇతరులకు మనల్ని మరింత హ్యాండ్సమ్ గా లేదా బ్యూటిఫుల్ గా కనిపించేలా చేయడమే కాకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా మొదటి స్థానం వహిస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి చాలామంది చేసే ప్రయత్నాలలో అందానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇక చాలా వరకు కాస్ట్లీ కాస్మెటిక్స్ ఉపయోగిస్తూ మరింత అందంగా మారుతున్నారు. ఇంకొంతమంది స్వతహాగా పుట్టుకతోనే అందంగా పుడతారు అనడంలో సందేహం లేదు.

ఇదిలా ఉండగా ప్రపంచ దేశాలలో అత్యంత అందంగా కనిపించే మహిళలే కాకుండా అత్యంత అందంగా కనిపించే పురుషులకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ముఖ్యంగా ప్రపంచ దేశాలలో అందంగా ఉన్న పురుషుల జాబితా బయటకు తీయగా.. అందులో ఒక్కో దేశానికి సంబంధించిన ర్యాంకింగ్ లిస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ప్రపంచంలోనే అత్యంత అందమైన పురుషులు ఉన్న దేశాలు ఏవి ? ఏ దేశానికి ఏ ర్యాంకింగ్ ఇస్తున్నారు? ముఖ్యంగా మన భారతదేశ స్థానం ఎంత ? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

ప్రపంచంలో అత్యంత అందమైన పురుషులు ఉన్న దేశాల ర్యాంకింగ్ విషయానికొస్తే.. మొదటి స్థానంలో నిలిచింది స్పెయిన్. రెండవ స్థానంలో స్వీడన్, మూడవ స్థానంలో ఫ్రాన్స్, నాలుగవ స్థానంలో బ్రెజిల్ , ఐదవ స్థానంలో ఇటలీ, ఆరవ స్థానంలో టర్కీ, ఏడవ స్థానంలో భారతదేశం, ఎనిమిదవ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 9వ స్థానంలో జపాన్, పదవ స్థానంలో జర్మనీ నిలిచాయి.

ఇక ఆ తర్వాత స్థానాలలో సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, డెన్మార్క్ , దక్షిణ ఆఫ్రికా, చైనా , నార్వే, లెబనాన్, పాకిస్తాన్, చెక్ రిపబ్లిక్ , వెనిజులా, వియత్నాం, సోమాలియా, అంగోల , దక్షిణ కొరియా వంటి దేశాలు స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇక ఈ దేశాలలో పురుషులు అందంగా ఉన్నట్లు ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం బయటపడింది. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అత్యంత అందమైన పురుషులు ఉన్న దేశాల జాబితాలో భారతదేశం ఏడవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Tags:    

Similar News