సరదా కోసం వెళ్లి.. ప్రాణాల గుప్పిట్లో స్కైడైవర్.. చివరికి ఏమైందంటే?
అత్యాధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం పక్కవారితో మాట్లాడడానికి కూడా సమయం లేకుండా పోతోందనే మాట వాస్తవం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.;
అత్యాధునిక ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం పక్కవారితో మాట్లాడడానికి కూడా సమయం లేకుండా పోతోందనే మాట వాస్తవం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది భవిష్యత్తుకు పునాదులు వేయడానికి ఇప్పుడు ఏ రేంజ్ లో కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కాస్త సమయాన్ని కూడా డబ్బు సంపాదించడానికే ఆలోచిస్తున్నారనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే మరి కొంతమంది మాత్రం ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నా సరే జీవితంలో సంతోషం లేకపోతే సంపాదించిన డబ్బు కూడా వృధానే అని చెబుతున్నారు. అందుకే కాస్త సమయం దొరికితే చాలు తమ సమయాన్ని ఎంజాయ్ చేయడానికి కేటాయిస్తున్నారు. అయితే ఎంజాయ్ చేయడం తప్పులేదు కానీ ఆ సరదా ఒక్కోసారి ప్రాణాల గుప్పెట్లోకి వెళితే ఎలా ఉంటుందో చెప్పడానికి కూడా నోరు రాదు. సరిగ్గా ఇప్పుడు అలాగే ఒక స్కై డైవర్ ఇలాంటి సంఘటనను ఎదుర్కొన్నారని చెప్పాలి. సరదా కోసం వెళ్లి విమానం వెనుక భాగంలో చిక్కుకొని గాల్లో తేలాడుతూ నరకయాతన అనుభవించారు. మరి చివరకు ఏం జరిగింది ? అసలు విమానానికి చివర్లో ఇరుక్కోవడం ఏంటి? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఈ ఏడాది సెప్టెంబర్ లో దక్షిణ కెయిర్న్స్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. ఇందులో స్కై డైవర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని, సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఇకపోతే ఇప్పుడు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 15 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసేందుకు కొంతమంది వ్యక్తులు సిద్ధమవగా.. ఈ క్రమంలోనే గాల్లో ఉన్న విమానం నుంచి పారాచూట్ సహాయంతో ఒక వ్యక్తి కిందకి దూకుతుండగా.. పారాచూట్ విమానానికి చిక్కుకుపోయింది. దీంతో స్కై డైవర్ భయాందోళనకు గురయ్యాడు.
అనంతరం తన వద్ద ఉన్న మరో పారాచూట్ సహాయంతో ఈ స్కై డైవర్ సురక్షితంగా కిందికి దిగారు. ఆ తర్వాత పైలెట్ కూడా విమానాన్ని క్షేమంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. సరదా కోసం చేసిన ఒక పని ఆయన ప్రాణాలకే ముప్పు తెచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఒక్కొక్కరు తమ అభిప్రాయాలను భిన్నవిభిన్నంగా వ్యక్తపరుస్తున్నారు.