మళ్లీ కర్ఫ్యూ వచ్చేసింది.. ఎన్ని నగరాల్లో అంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారు ఎవరైనా సరే.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే.. కరోనా తాలుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఎక్కడా కనిపించదు. అవసరమైతేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని చెబుతున్నా.. అలాంటివేమీ పట్టించుకోకుండా బయటకు వచ్చేస్తున్న వైనం.. షాపులు.. రోడ్లు రద్దీగా ఉండటమే కాదు.. ఎవరూ కరోనాను కేర్ చేయటం లేదన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే.. మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో.. నగరాల్లో తాజా పరిస్థితి ఏమిటన్నది చూస్తే.. షాకింగ్ కలుగక మానదు.
దసరా.. దీపావళి తర్వాత దేశంలో కేసులు పెరగటం.. ఢిల్లీ.. కేరళలో సెకండ్ వేవ్ వచ్చేసినట్లుగా కొత్త కేసుల నమోదు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. దీంతో.. పలు రాష్ట్రాలు అలెర్టు అయ్యాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నాటి జాగ్రత్తలు.. పరిమితుల్ని తెర మీదకు తెచ్చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్.. సూరత్.. వడోదర నగరాల్లో శనివారం రాత్రి నుంచి కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి.
తాజాగా అమలు చేస్తున్న కర్ఫ్యూ ఎప్పటివరకు అన్న విషయంపై స్పష్టత ఇవ్వటం లేదు. అదే సమయంలో.. పలు రాష్ట్రాలు సెకండ్ వేవ్ మీద ఇప్పటికే జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తోంది. ఇందుకు భిన్నమైన పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీల హడావుడి.. ప్రచారం తీరు చూస్తే.. భయం కలగటం ఖాయం. ఎందుకంటే.. ఎవరూ కరోనా జాగ్రత్తల్ని తీసుకోకపోవటమే.
గుజరాత్ తో పాటు.. మధ్యప్రదేశ్ లోని భోపాల్.. గ్వాలియార్. . ఇండోర్ లలో రాత్రివేళ కర్ఫ్యూను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక.. తమిళనాడులో మాస్కుల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ప్రతి రాష్ట్రం సెకండ్ వేవ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంటే.. అందుకు భిన్నమైన పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నట్లుగా చెప్పక తప్పదు. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదన్న మాట చెబుతున్నారు. మరి.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై ప్రత్యేక ఫోకస్ పెడితే మంచిది.