• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏపీలో లోకల్, ఉప ఎన్నికల...

ఏపీలో లోకల్, ఉప ఎన్నికల ఫలితాలు ‘జంబలకిడి పంబ’

By - Tupaki Desk
Update: 2021-03-02 07:30 GMT
ఇటీవలి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగింది. అయితే త్వరలో జరిగే ‘తిరుపతి’ ఉప ఎన్నికలో ఎటువంటి ఫలితం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే లోకల్ ఎన్నికలకు.. ఉప ఎన్నికలకు మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. ఏపీ చరిత్ర చూస్తే ఆ విషయం అవగతం అవుతుంది.. చరిత్రలోకి వెళితే..

2009 సంవత్సరం అదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులవి. రెండోసారి కాంగ్రెస్ ను గెలిపించి వైఎస్ఆర్ సెకండ్ టైమ్ సీఎం కుర్చీలో కూర్చుకున్నారు. అయితే సడెన్ గా ఆయన హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించాడు. తర్వాత రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. కాంగ్రెస్ లో నాయకత్వ సమస్య ఏర్పడింది. తండ్రి వారసత్వం దక్కకపోవడంతో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి పార్టీ పెట్టాడు. ఆయనపై కేసులతో కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది. దీంతో కాంగ్రెస్ ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేశారు. వైఎస్ఆర్ మరణంతో ఖాళీ అయిన సీటు పులివెందులలో ఆయన భార్య విజయమ్మ పోటీచేయగా.. కడప ఎంపీగా జగన్ పోటీచేశారు.

అయితే నాటి ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీని జగన్, విజయమ్మలు చిత్తుగా ఓడించారు. విజయమ్మ దాదాపు లక్ష మెజారిటీతో పులివెందుల ఎమ్మెల్యేగా గెలవగా.. జగన్ కడప ఎంపీగా ఏకంగా 5.25 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటాడు.

ఆ తర్వాత జగన్ పై విశ్వాసంతో కాంగ్రెస్ లోని 18మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అందులో 16మందిని జగన్ మళ్లీ గెలిపించుకున్నాడు. ఆ సమయంలో టీడీపీకి 18శాతం ఓట్లు రాగా.. వైసీపీకి 48శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ ఓట్లు రాలేదు.

  ఇక కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు నంబర్ 1 స్థానం దక్కింది. టీడీపీ, వైసీపీలు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణలుగా విడిపోయింది.  2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలిచింది కేవలం 1శాతం ఓట్లతేడాతోనే.. ఆ ఒక్క శాతం ఓట్లతోనే వైసీపీ దాదాపు 30 ఎమ్మెల్యే సీట్లు పోగొట్టుకుంది.

నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్ 15 రోజులు తిరిగినా టీడీపీకి 26 వేల మెజారిటీ వచ్చింది.. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆఖరుకు వైఎస్ వివేకానందరెడ్డి టీడీపీ చేతిలో కూడా ఓడిపోయాడు. వైఎస్ కుటుంబంలోనే కొందరు మోసం చేసి ఓడించారనే టాక్ ఉంది.
 
అదే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కొనసాగింది. 50శాతం ఓట్లతో  151 సీట్లు వైసీపీ గెలిచింది. వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది.

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ మాత్రం మెరుగుపడ్డామని వాళ్ల లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు మారుతున్నాయని తేటతెల్లమవుతోంది. కాబట్టి ఓటరు ఎప్పటికప్పుడు మారుతున్నాడు. ఏపీ రాజకీయాల్లో పార్టీల విజయావకాశాలను మార్చేస్తున్నాడు. సమయం, సందర్భం బట్టి నిర్ణయించుకుంటున్నారు. అందుకే పార్టీలన్నీ జాగ్రత్తగా వ్యవహరించాలని మేధావులు అంటున్నారు. 
Tags:    
  • Local Elections 
  • Andhra Pradesh 
  • Ysrcp 
  • Ys Jagan 
  • Chandra Babu 
  • Tdp 
  • Municipal Elections 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS