భర్తను వదిలేసి వేరే వ్యక్తితో సహజీవనం .... మ‌హిళను దారుణంగా హింసించిన గ్రామ‌స్థులు !

Update: 2021-02-16 07:30 GMT
మధ్యప్రదేశ్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భోపాల్‌లోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో ఉంటోంది. దీంతో గ్రామస్థులు ఆమె అత్తింటివారితో క‌లిసి ఆమెకు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యం తీసుకుని ఆ మ‌హిళ భుజాల‌పై బాలుడిని ఎక్కించి ఊరేగించారు గ్రామ‌స్థులు. ఇలా ఆమె దాదాపు మూడు కిలోమీట‌ర్లు బాలుడిని భుజాల‌పై మోసుకుంటూ వెళ్లేలా చేశారు.

 అంతా చుట్టూ చేరి ఆమెపై బెదిరింపుల‌కు పాల్ప‌డి ఓ బాలుడిని భుజాలపై మోస్తూ శిక్ష అనుభ‌వించాల‌ని చెప్ప‌డంతో ఆమె వారిని ఎదిరించ‌లేక‌పోయింది. ఆమెను ఇలా ఊరేగిస్తూ, కొడుతూ  ఆ దృశ్యాలను కొంద‌రు స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఆమెను అవ‌మానిస్తూ గ్రామ‌స్థులు, అత్తింటివారు పాల్ప‌డిన ఈ ఘ‌ట‌నకు సంబంధించిన స‌మాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పోలీసులు దీనిపై కేసు న‌మోదు చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవటంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనుక కారకులైన నలుగురిని అరెస్ట్ చేశారు.మధ్యప్రదేశ్ లో ఈ తరహా ఘటనలు జరగటం ఇది మొదటిసారి కాదు.గతేడాది జులైలో వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.భర్తను భుజాలపై ఎక్కించుకుని ఊరంతా తిప్పారు. ఆ ఘటనను సెల ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆకేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Tags:    

Similar News