• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వంశీకి వైసీపీ సెగ‌.. ఇన్...

వంశీకి వైసీపీ సెగ‌.. ఇన్ చార్జ్ గా ఆయ‌న వ‌ద్దంటూ లేఖ‌!

By - Tupaki Desk
Update: 2022-03-20 10:30 GMT
ఆయ‌న ఏవో ఆశ‌ల‌తో వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి..గెలుపున‌కు సాయం చేసిన టీడీపీని సై తం ప‌క్క‌న పెట్టి.. వైసీపీలోకి చేరిపోయారు. పైగా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును సైతం తూల‌నాడారు. వైసీపీ మెప్పుకోసం అన‌రాని మాట‌లు కూడా అనేసి సారీ చెప్పారు. అయితే.. ఇంత త్యాగం  చేసినా.. ఆయ‌న‌కు ఇప్పుడు అదే వైసీపీలో సెగ పుడుతోంది. నాయ‌కులు ఎవ‌రూ కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న ప‌రిస్థితి లేదు. ఆయ‌నే కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ.

అస‌లు వంశీ.. వైసీపీలోకి రావ‌డం వెనుక మంత్రి కొడాలి నాని ప్రోద్బ‌లం ఒక్క‌టే ఉంది. కానీ, గ‌న్న‌వ‌రం లో ఉన్న వైసీపీ నాయ‌కులు.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు కానీ, మ‌రో సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కానీ, వంశీ వైసీపీలోకి రావ‌డాన్ని స‌హించ‌లేదు. అంతేకాదు.. పలు సందర్భాల్లో వంశీ వర్సెస్ వెంకటరావు మద్దతు దారుల నిరసనలు చోటు చేసుకున్నాయి. అయితే, పార్టీ అధిష్టానం.. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో  ఇరు ప‌క్షాలు ఒకింత శాంతించాయి.

అయితే.. తాజాగా గన్నవరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు వల్లభనేని వంశీకి ఇవ్వద్దంటూ.. గన్నవ రం వైసీపీ నాయ‌కులు  కార్యకర్తల రూపంలో వంశీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి ఆ లేఖ పంపినట్లుగా వైరల్ అవుతోంది. పార్టీ పెట్టిన త‌ర్వాత తొమ్మిదేళ్ల కాలంలో పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని లేఖలో పేర్కొన్నారు. జగన్‌ను మరోసారి సీఎంను చేసుకుంటామని లేఖలో భ‌రోసా క‌ల్పించారు.

ఈ సంద‌ర్భంగా వంశీపై కొన్ని ఆరోప‌ణ‌లు కూడా చేశారు. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. వంశీ త‌మ‌పై అక్ర‌మ కేసులు పెట్టించార‌ని.. ఈ విష‌యంలో ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని వాపోయారు. నియోజకవర్గంలో వంశీ పెత్త‌నం ఎక్కువైంద‌ని.. ఫిర్యాదు చేశారు. అదేస‌మ‌యంలో వంశీ కాకుండా ఎవరిని నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా నియమించినా తమకు సమ్మతమే అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు. నియోజకవర్గంలో తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వంశీ అనుచరులకే స్థానిక పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా.. పార్టీ అభ్యర్ధి 30 వేల పైగా మెజార్టీతో విజయం సాధిస్తారని లేఖ‌లో ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ లేఖ‌పై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. ఇష్ట‌ప‌డి పార్టీలో కి తెచ్చుకున్న వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటం పార్టీలో చర్చకుదారితీసింది. మ‌రి ఈ లేఖ‌పై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.
Tags:    
  • Ysrcp Party 
  • Krishna District 
  • Gannavaram 
  • Mla 
  • Vallabhaneni Vamsi 
  • Letter 
  • Latestnews 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS