• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేంద్రం భారీ షాక్.....

కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న రీ-రిజిస్ట్రేషన్ చార్జీలు

By - Tupaki Desk
Update: 2022-03-15 10:15 GMT
15 ఏళ్లు దాటిన పాత వాహనాలకు రీ రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ చార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి రీ రిజిస్ట్రేషన్ కు 8 రెట్లు ఫీజు వసూలు చేయనున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల రీ-రిజిస్ట్రేషన్ కు రూ.300 వసూలు చేస్తున్నారు. ఇక నుంచి రూ.1000 వసూలు చేయనున్నారు. కార్లకు రూ.600కు బదులుగా రూ.5000 వసూలు చేస్తారు. దిగుమతి చేసుకున్న కార్లకు రూ.15వేలకు బదులుగా రూ.40వేలు వసూలు చేస్తారు.

15 ఏళ్ల రిజిస్ట్రేషన్ గడువు దాటిన వ్యక్తిగత వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆలస్యమైతే వారి వద్దనుంచి నెలకు రూ.300 చొప్పున అదనంగా వసూలు చేస్తారు. వాణిజ్య వాహనాలకు నెలకు రూ.500 వసూలు చేస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు ప్రతీ 5 సంవత్సరాలకు  ఒకసారి రీ-రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.  ఒకవేళ, వాణిజ్య  వాహనాలకు  ఫిట్ నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ చేయించుకోవడం ఆలస్యం  అయితే రోజుకు రూ.50 చొప్పున  అదనంగా వసూలు చేయనున్నారు.

15 ఏళ్ల కంటే పాతబడిన ద్విచక్ర వాహనాల ఆర్.సీ రెన్యువల్ ఫీజును రూ.300 నుంచి రూ.1000కి పెంచనున్నారు. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్ నెస్ రెన్యువల్ కోసం రూ.12500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశం అంతటా ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి.

అయితే ఈ రూల్ ఢిల్లీలో వర్తించదు. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు , 10 ఏళ్లు పైబడిన  డీజిల్  వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. ఒకవేళ వారు తమ వాహనాలను దేశ రాజధాని ఢిల్లీలో నడపాలనుకుంటే తమ పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది.

వాణిజ్య వాహనాలకు ఎనిమిదేళ్లు దాటితే ఫిట్ నెట్ సర్టిఫికెట్ తప్పనిసరి. రీ-రిజిస్ట్రేషన్, ఫిట్ నెట్ చార్జీల పెంపుతో వాహనాల యజమానులు తమ పాత వాహనాలను తుక్కుకింద తరలించేందుకు మొగ్గు చూపుతారని ప్రభుత్వం భావిస్తోంది.

దేశంలో 1.2 కోట్ల వాహనాలు తుక్కు కింద మార్చదగినవి ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది.  తుక్కు కింద మార్చేందుకు వాహనాలను ఇవ్వడానికి సిద్ధమయ్యే ప్రక్రియను సులభతరం చేయడానికి ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఆన్ లైన్ లో ఉంచింది.  తుక్కుకింద తమ వాహనాలు ఇచ్చే యజమానులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Tags:    
  • Registration 
  • OldVechiles 
  • RoadTransport 
  • Fitness 
  • Delhi 
  • FitnetCertificate 
  • Reregistration 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS