సూసైడ్ చేసుకున్న బుల్లితెర నటుడు

Update: 2019-12-27 10:34 GMT
కారణం తెలీదు కానీ బుల్లితెర నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. టీవీ సీరియస్ లో గుర్తింపు తెచ్చుకున్న కుశాల్ పంజాబీ ఈ రోజు (శుక్రవారం) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వైనం అందరిని విస్మయాని కి గురి చేస్తోంది. విషాదం లో నిపేస్తుంది. ఇష్క్ మే మర్ జావా ధారావాహిక తో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న కుశాల్.. హిందీ సీరియల్స్ లో ఫేమస్.

అతడి ఆత్మహత్య వార్త విన్న వారంతా అవాక్కు అవుతున్నారు. ఆయన సహచర నటులంతా ఈ విషాదాన్ని దిగమింగుకోలేకపోతున్నారు. అతడి సూసైడ్ గురించి తెలిసినంతనే అతని స్నేహితుడు కర్ణవీర్ బోహ్రా ఒక ట్వీట్ చేశారు. ఎమోషనల్ గా ఉన్న ఈ ట్వీట్ ను చూస్తే..

నువ్వు మరణించావనే వార్త నన్ను నరకంలోకి తీసుకెళ్లింది. ఈ వార్తను నేనిప్పటికీ నమ్మలేకపోతున్నా. హ్యాపీగా జీవితాన్ని గడిపే నువ్వు.. ఇలా ఎందుకు చేశావో అర్థం కావటం లేదు. జీవితాన్ని నువ్వు చూసే కోణం ప్రతిసారీ ఎంతో ఇంప్రెస్ అవుతుంటా. ఒక డ్యాన్సింగ్ డాడీగా ఎప్పటికి నిన్ను గుర్తు పెట్టుకుంటానని తన పోస్టు లో పేర్కొన్నాడు.

కుశాల్ మరణం గురించి తెలిసిన ఇతర నటులు సైతం ఈ వార్తను తాము నమ్మ లేకపోతున్నామని. జీర్ణించుకో లేకపోతున్నట్లు పేర్కొన్నారు. నటి శ్వేత తివారీ రియాక్ట్ అవుతూ.. ఓ మై గాడ్.. ఎప్పుడు? ఎలా? జరిగింది? అని క్వశ్చన్ వేశారు. ఇది నిజం గానే చాలా బాధా కరమైన విషాదమని.. తాను నమ్మలేక పోతున్నట్లు పేర్కొంది. అతని ఆత్మ కు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియా లో తన మెసేజ్ ను పోస్టు చేసింది.


Tags:    

Similar News