సిగ్నల్ వద్ద హారన్ కొడితే గ్రీన్ పడినా రెడ్‌ కు జంప్ - ముగ్ధుడైన కేటీఆర్

Update: 2020-01-31 17:30 GMT
ట్రాఫిక్‌ లో ఇష్టారీతిన హారన్ కొట్టేవారిని కట్టడి చేసేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. ముంబైలో అదేపనిగా మోగించే వాహనాల హారన్స్ శబ్దకాలుష్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా సిగ్నల్స్ వద్ద రెడ్ సిగ్నల్ పడినా కొందరు హారన్స్‌ తో అందరినీ ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుగకు 'ది పనిషింగ్ సిగ్నల్'ను తీసుకు వచ్చారు దేశ ఆర్థిక రాజధాని ట్రాఫిక్ సిబ్బంది.

ఈ సరికొత్త ప్రయోగంపై తెలంగాణ ఐటీ - పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరిచారు. ఈ ప్రయోగాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేద్దామని ట్వీట్ చేశారు. తెలంగాణ డీజీపీ - హైదరాబాద్ నగర సీపీ - జీహెచ్ ఎంసీ కమిషనర్‌ లను సహకారం అవసరమని పేర్కొన్నారు.

ముంబై ట్రాఫిక్ పోలీసుల ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తోంది. కొన్ని భారీ కూడళ్ల వద్ద డెసిబుల్స్ మెషీన్లతో సిగ్నలింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. వీటి ద్వారా వెహికిల్స్ పైన వెళ్లేవారి హారన్ మోతలకు కళ్లెం వేశారు. హారన్ శబ్దాలు డెసిబుల్స్ మీటర్‌లో 85 కంటే ఎక్కువ నమోదయితే మళ్లీ రెడ్ సిగ్నల్ పడుతుంది. గ్రీన్ సిగ్నల్ పడగానే ఎవరిదారిన వారు సైలెంట్‌ గా వెళ్లిపోతే మాత్రం ఇబ్బంది లేదు.

కానీ హారన్ పైన చెయ్యి పడితే.. మాత్రం గ్రీన్ సిగ్నల్ పడినప్పటికీ.. ఆ వెంటనే రెడి సిగ్నల్‌ లోకి జంప్ అవుతుంది. ప్రమాదకరమైన 85 డెసిబుల్స్ స్థాయి దాటితే సిగ్నల్ టైమర్ రీసెట్ అయి గ్రీన్ నుంచి రెడ్ సిగ్నల్‌కు జంప్ అవుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థను అలా అనుసంధానం చేశారు.

చత్రపతి శివాజీ మహారాజా టెర్నినస్ - మెరైన్ డ్రైవ్ - పెద్దార్ రోడ్ - హింద్‌మాతా సినిమా దబార్ - బాంద్రా వంటి పెద్ద పెద్ద జంక్షన్ల వద్ద ఈ డెసిబుల్ మీటర్స్‌ను ఇన్‌ స్టాల్ చేశారు. ఈ మేరకు ముంబై పోలీసులు ఓ వీడియోను కూడా షేర్ చేశారు.

   

Tags:    

Similar News