సిక్కోలు టూ తిరుపతి రైలు...రామ్మోహన్ మెరుపులు

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు.;

Update: 2026-04-09 03:06 GMT

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఆయన జోరు చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న సాగునీటి ప్రాజెక్టు నేరడికి అవరోధం ఉన్న వాటి మీద గెజిట్ నోటిఫికేషన్ తెచ్చి వంశధార నదీ జలాలను పూర్తిగా వాడుకునేలా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారు. ఇక తాజాగా ఆయన మరో కీలకమైన శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల కోరిక అయిన డైరెక్ట్ తిరుపతి ట్రైన్ ని మంజూరు చేయించి శభాష్ అనిపించుకున్నారు.

రెగ్యులర్ ట్రైన్ కోసం :

శ్రీకాకుళం వాసులు తిరుపతి వెళ్లాలీ అంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు. అలాంటిది కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన కృషి ఫలితంగా శ్రీకాకుళం నుండి తిరుపతికి మొట్టమొదటి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీసు మంజూరైంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ తిరుపతి – శ్రీకాకుళం రోడ్ హమ్సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 13 నుండి ప్రారంభించనుంది. ఇక ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి అలాగే ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్ నుండి ప్రయాణిస్తుంది. దీంతో ప్రజలకు తిరుపతి కష్టాలు తప్పాయని అంటున్నారు.

ఎంతో వ్యయ ప్రయాసలు :

ఇక ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తిరుపతి పర్యటన కోసం భువనేశ్వర్ నుండి ప్రారంభమయ్యే రైలు సర్వీసులపై ఆధారపడేవారు. మరో వైపు విశాఖపట్నం మీదుగా తిరుమల దర్శనం కోసం ప్రయాణించి విపరీతమైన రద్దీ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ఈ కొత్త సర్వీసుతో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ఎక్కువ బెర్త్‌లు అందుబాటులోకి వస్తాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పటి నుండి ఈ లక్ష్యాన్ని పెట్టుకుని రైల్వే మంత్రులు, రైల్వే బోర్డు, డీఆర్ ఎం, జోనల్ మీటింగ్‌లలో నిరంతరం ప్రయత్నాలు చేసినట్టుగా ఆయన తెలిపారు.

జిల్లా మరింతగా అభివృద్ధి :

ఇదిలా ఉంటే ఈ నూతన సర్వీసును ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం నుండి మరిన్ని నూతన రైలు సర్వీసులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని, జిల్లా రైల్వే ప్రగతిని ముందుకు తీసుకెళ్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మొత్తానికి చూస్తే రామ్మోహన్ నాయుడు జిల్లా ప్రగతి విషయంలో తనదైన చొరవ చూపిస్తున్నారు. దాంతో రానున్న రోజులలో జిల్లా మరింతగా అభివృద్ధి పధంలో సాగుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News