థాయ్ బంధం..కొత్త అర్థం చెప్పిన కేటీఆర్

Update: 2020-01-18 11:11 GMT
తెలంగాణ ఐటీ మంత్రిగా.. కేసీఆర్ వారసుడిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో కేటీఆర్ కృషి ఎనలేనిది.. వివిధ పారిశ్రామిక వేత్తలతో దేశాలతో డీల్స్ కుదర్చడంలో కేటీఆర్ ది అందెవేసిన చేయి. తాజాగా తెలంగాణకు మరో ఒప్పందాన్ని కేటీఆర్ చేసుకున్నారు.

తాజాగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఇండియా -థాయ్ లాండ్ మ్యాచింగ్ అండ్ నెట్ వర్కింగ్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. థాయ్ లాండ్ ఉప ప్రధాని జరీన్ రాకతో తో భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆదేశ ప్రతినిధులు ముందుకు రావడం శుభసూచికమన్నారు.

తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ కి సరిపడా నీటి వనరులు ఉన్నాయని.. ఫర్నిచర్ ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడుతున్న థాయ్ లాండ్ తెలంగాణలో పెట్టాలని మంత్రి కేటీఆర్ కోరారు. రబ్బర్ వుడ్, టింబర్ వుడ్ ఉత్పత్తుల ట్రాన్స్ పోర్టు కోసం కృష్ణపట్నం తీరం అనువుగా ఉందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ వృద్ధి రేటు.. దేశం వృద్ధి రేటును మించి ఉందని.. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ అని కేటీఆర్ అన్నారు. బ్యాంకాక్ -హైదరాబాద్ ఎయిర్ లైన్స్ పెంచి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని కేటీఆర్ అన్నారు.


Tags:    

Similar News