• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అప్ప‌టి అమెరికే...

అప్ప‌టి అమెరికే బాగుందంటున్న కేటీఆర్‌

By - Tupaki Desk
Update: 2017-02-25 13:31 GMT
అమెరికాలోని కాన్సాస్ లో జాత్యాంకారి ఆడమ్స్ తూటాలకు బలైన కుచిబొట్ల శ్రీనివాస్ కుటుంబాన్ని కుత్బుల్లాపూర్ లోని శంబీపూర్ లోని ప్రనీత్ హోంలో మంత్రులు  కేటీఆర్ - మహేందర్ రెడ్డి పరామార్శించారు. స్థానిక ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు - ఎమ్మెల్యే వివేక్ - టీఆర్ ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లితో క‌లిసి శ్రీనివాస్ తల్లిదండ్రులు వర్ధిని - మదుసూధన్ రావు లను మంత్రులు ఓదార్చారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని మంత్రులు హామీ ఇచ్చారు. త‌మ‌కు కలిగిన కష్టనష్టాలు ఏ తల్లిదండ్రులకు కలగరాదని, శ్రీనివాస్ తల్లిదండ్రులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తన వాళ్ళను వదిలి విదేశాల్లో కొలువు చేసుకుంటున్న వ్య‌క్తి విద్వేషక కాల్పుల్లో దుర్మరణం పాలుకావటం బాధాకరమ‌న్నారు. బంధువులు - సన్నిహితులు తల్లడిల్లుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. శ్రీనివాస్ తల్లిదండ్రుల వంటి  పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలని ఆకాక్షించారు. హ‌త్య విష‌యం తెలియ‌గానే...కేంద్ర విదేశాంగ శాఖా మంతి సుష్మా స్వరాజ్ తో మాట్లాడిన‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వ పక్షాన  ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ, విదేశాంగ శాఖ గళాన్ని, నిరసనను తెలపాలని అన్నారు. అక్కడ ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వక పోయినా.. సరే భారత్ కు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారని, కానీ ఉన్మాద ధోరణి సమర్థ‌నియం కాదని స్ప‌ష్టం చేశారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి సుష్మాస్వరాజ్ ను కలుస్తానని చెప్పారు. భవిష్యత్ లో ఎవరికీ ఇలా జరగొద్ద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

తాను 8 ఏళ్ళు అక్కడ ఉన్నాన‌ని చెప్పిన మంత్రి కేటీఆర్ ఇదివరకు.. ఇపుడు ఉన్న అమెరికా వేరని వ్యాఖ్యానించారు.భయానక వాతావరణం స‌రికాద‌ని ఇలా చేయటం  ట్రెండ్  మాదిరిగా అవుతుంద‌ని, అలా అవటం మంచిది కాదని పేర్కొన్నారు. అమెరికాలో లో ఉన్న భారతీయులు ఎవరి జాగ్రత్తలో వారు ఉంటే మంచిదని మంత్రి కేటీఆర్ సూచించారు. త్వరలో పాజిటివ్ వాతావరణం ఏర్పదుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటన లో  గాయపడ్డ ఆలోక్ రెడ్డి కుటుంభ సభ్యులతో కూడా మాట్లాడామ‌ని, వాళ్లకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని భ‌రోసా ఇచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • KTR 
  • Kansas Attack 

Similar News

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

పవన్ బ్యాలెన్స్ పాలిటిక్స్...చాన్స్ కోసం సైనిక్స్ !

2026-11-19 03:14 GMT

ఈ నెల 23 నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ?

2026-11-19 03:13 GMT

జగన్ లండన్ టూర్ ఫిక్స్...ఫుల్ బిజీగానే !

2026-11-19 03:13 GMT

₹50 కోట్ల పెళ్లి.. 4 లక్షల మంది అతిథులు.. విజేతకు థార్ కారు.. ఇలాంటిది చూడలేదప్పుడు?

2026-11-19 03:12 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

మోడీ ఎక్కింది బజాజ్ ఆటో.. క్రెడిట్ మాత్రం పాకిస్తాన్‌కు.. ఫుల్ కామెడీ

2026-11-19 03:07 GMT

చిన్న సైజులో ఎలక్ట్రిక్ డిఫెండర్.. 2027లో రాక!

2026-11-19 03:06 GMT

పెళ్లి పిలుపు ఓకే... షర్మిల వ్యూహం మీదనే ఎన్నో ప్రశ్నలు !

2026-11-19 03:03 GMT

Copyright @2026

Powered by Blink CMS