• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  'ఫాంహౌస్' ఆరోపణలపై...

'ఫాంహౌస్' ఆరోపణలపై స్పందించిన కేటీఆర్

By - Tupaki Desk
Update: 2020-06-07 05:30 GMT
హైదరాబాద్ గండీపేట సమీపంలోని జాన్వాడ గ్రామంలో జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ నిర్మించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దీనిపై కోర్టులు - జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాడు.  అక్రమ నిర్మాణంతో ప్రభుత్వ ఉత్తర్వులను కేటీఆర్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మేరకు కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేసింది.

గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక కాంగ్రెస్ నేత తనపై దుష్ర్పచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆ భూమి తనది కాదని గతంలోనే స్పష్టంగా చెప్పానని అన్నారు.

తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తనపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలని నిరూపిస్తానని కేటీఆర్ అన్నారు.  ఉద్దేశపూర్వక పరువు నష్టం కలిగించారని.. వారిని న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.

అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా - ఎన్‌ జిటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కెటిఆర్‌ తో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి - జిహెచ్‌ ఎంసి - హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా - మురుగునీటి బోర్డు - హెచ్‌ ఎండిఎ - హైదరాబాద్ సరస్సులు - వాటర్ బాడీ మేనేజ్‌ మెంట్‌ తో నోటీసులు జారీ చేసింది. ఎన్జీటి దర్యాప్తు ప్రారంభించింది. అక్రమ నిర్మాణం - అనుమతులు మరియు ఇతర వాస్తవాలను ధృవీకరించడానికి ఎన్జీటి నిజనిర్ధారణ కమిటీని ప్రారంభించింది.

రేవంత్ రెడ్డి ఆరోపణల ప్రకారం - ఫాం హౌస్ దాదాపు మూడు లక్షల చదరపు అడుగులలో మూడు అంతస్తులు - ఈత కొలను మరియు తోటతో నిర్మించారు.. ఫాంహౌస్ కోసం రహదారి వేయడానికి ఉస్మాన్ సాగర్ లో ఒక ప్రధాన నీటి వనరును మట్టితో మూసివేశారని రేవంత్ రెడ్డి పిటిషన్ లో ఆరోపించారు..


Tags:    
  • KTR 
  • Farm House 
  • Revanth Reddy 
  • Telugu News 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS