• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వాటర్‌గ్రిడ్‌ హామీల్ని...

వాటర్‌గ్రిడ్‌ హామీల్ని అటకెక్కిస్తారో ఏంటో?

By - Tupaki Desk
Update: 2015-01-21 02:30 GMT
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు లబ్ధి చేకూరేలా ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఇంటింటికీ నల్లా వచ్చేలా చేస్తాం అన్నది కూడా ఒకటి. తెలంగాణ పది జిల్లాల వ్యాప్తంగా వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేయడం ద్వారా... ప్రతి ఇంటికీ తాగునీరు నల్లా ద్వారా సరఫరా అయ్యేలా చేస్తాం అంటూ కేసీఆర్‌ చాలా ఘనంగా హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ నల్లా ఏర్పాటు చేయకపోతే గనుక.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతూ అసలు ప్రజల ముందుకు రానే రానంటూ కేసీఆర్‌ భీషణ ప్రతిజ్ఞ కూడా చేశారు. అయితే తాజాగా కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన- వాటర్‌గ్రిడ్‌ విషయంలో పెడుతున్న మెలికలను గమనిస్తోంటే... ఏదో తేడా కనిపిస్తోంది. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ఆచరణసాధ్యం కాదనే సంగతి తెలంగాణ ప్రభుత్వానికి నెమ్మదినెమ్మదిగా బోధపడుతుండగా.. దాన్ని అటకెక్కించే ప్రమాదం ఉన్నట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.

అలాంటి అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయంటే...

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మంగళవారం నాడు ఢిల్లీ పర్యటనలో చాలా బిజీగా గడిపారు. తెలంగాణ  ప్రభుత్వానికి రకరకాల కేంద్ర సహాయం రాబట్టడం గురించి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. వినతులు సమర్పించారు.  అయితే ఉపాధిహామీ నిధుల్లో జాప్యం గురించి చర్చించినప్పుడు సంబంధిత మంత్రి వెంటనే స్పందించారని కేటీఆర్‌ ప్రకటించారు. అదే సమయంలో మరో కీలకాంశం ఏంటంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సంకల్పించిన వాటర్‌గ్రిడ్‌కు అయ్యే ఖర్చులో సగం కేంద్రమే భరించాలని మంత్రి బీరేంద్రసింగ్‌ను కోరినట్లు కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. అయితే ఈ వినతికి సదరు కేంద్రమంత్రిగారి స్పందన ఏంటో మాత్రం కేటీఆర్‌ ముడివిప్పి చెప్పలేదు.

అయితే... ఓట్లకు లింకుపెట్టి మరీ.. వాటర్‌గ్రిడ్‌ చేసేస్తాం అంటూ ప్రకటించుకున్న తెరాస ప్రభుత్వం.. తాము రాజకీయ లబ్ధి పొందడానికి ఉద్దేశించిన ఈ పథకానికి సగం భారం భరించాల్సిందిగా.. భాజపా ప్రభుత్వాన్ని కోరడంలో ఒక మర్మం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెరాస రాజకీయ లాభంతో ముడిపడి ఉన్నది గనుక... పైగా వీరి విజ్ఞప్తిని ఆమోదిస్తే.. ఇదే తరహా ప్రతిపాదనలు అనేక రాష్ట్రాల గురించి వస్తాయి గనుక.. కేంద్రం దీనికి సహకరించే అవకాశం లేదనేది పలువురి అంచనా. అలాంటి నేపథ్యంలో.. కేంద్రంలోని భాజపా సహకరించలేదు గనుక.. మేం ఈ మంచి పనిని చేయలేకపోతున్నాం అంటూ ఇక్కడి రాజకీయ ప్రత్యర్థి భాజపా మీద నెపం పెట్టి కాలం గడిపేయవచ్చుననేది తెరాస సర్కారు వ్యూహంఅని పలువురు అనుమానిస్తున్నారు. అందుకే ఆచరణలో అవకాశం లేని విజ్ఞప్తిని కేంద్రం ఎదుట పెట్టి.. నెపం వారి మీద నెట్టేయడానికి చూస్తున్నట్లుగా కేటీఆర్‌ మాటలున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయినా.. సగం డబ్బు కేంద్రాన్ని భరించమని కోరడం అంటే.. సగం ఓట్లు భాజపాకు, సగం ఓట్లు తెరాసకు వేయమని కేటీఆర్‌ ప్రజలకు చెప్పగలరా? అని కూడా కొందరు భాజపా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి గులాబీ దళాలు ఈ మాటలకు ఏం జవాబు చెబుతాయో ఏంటో?
Tags:    
  • KTR 
  • Water Grid 
  • telugu NEws 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS