చంద్రబాబుకు సాధ్యం కానిది కేటీఆర్ చేశారే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి తరచూ విదేశీ పర్యటనలు చేయటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముందుంటారు. ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో పర్యటిస్తూ.. అక్కడి వారికి తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ను పెంచేందుకు కేటీఆర్ చాలానే కష్టపడుతున్నారు. తాజాగా ఆయన శ్రీలంకలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ.. పారిశ్రామిక ప్రముఖుల్ని కలుస్తున్న కేటీఆర్.. తాజాగా తనపర్యటనలో ఆసక్తికర ఒక అంశాన్ని విజయవంతంగా పూర్తి చేశారని చెప్పాలి.
తన విదేశీ పర్యటనల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా దేశ ప్రధానులు.. అధ్యక్షులతో భేటీ కావటం.. వారిని రాష్ట్రానికి ఆహ్వానించటం లాంటివి చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో పలువురు విదేశీ ప్రముఖులు రాష్ట్రానికి రానున్నట్లు చెప్పినా.. అవేమీ ప్రాక్టికల్ గా వర్క్ వుట్ కాలేదు. కానీ.. ఇందుకు భిన్నంగా కేటీఆర్ వ్యవహరించటం విశేషం. శుక్రవారం కొలంబోలో శ్రీలకం ప్రధాని విక్రమసింఘేతో భేటీ అయిన కేటీఆర్.. తెలంగాణలో చేస్తున్న కార్యక్రమాల్ని వివరించారు. టీ హబ్ అంశంపై శ్రీలంక ప్రధాని ఆసక్తి వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
ఇక.. తెలంగాణలో ఏర్పాటు చేయాలనుకుంటున్న టెక్స్ టైల్స్ పార్క్ లో శ్రీలంక పెట్టుబడులు పెట్టేలా చూడాలని కేటీఆర్ కోరారు. తనను హ్యుమన్ క్యాపిల్ సదస్సుకు ఆహ్వానం అందించటంపై కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. శ్రీలంక ప్రధానిని తెలంగాణలో పర్యటించాల్సిందిగా కోరారు. దీనికి ఆ దేశ ప్రధాని సానుకూలంగా స్పందిస్తూ.. తాను అక్టోబరులో భారత్ పర్యటిస్తానని.. ఆ సందర్భంగా తాను తెలంగాణకు వస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ.. శ్రీలంక ప్రధాని కానీ తెలంగాణకు రావటమే జరిగితే.. ఒక విదేశీ ప్రధానిని తన మాటలతో రాష్ట్రానికి తెచ్చిన ఘనత కేటీఆర్ సొంతం అవుతుంది. ఇప్పటికే తాను చేసిన పలు విదేశీ పర్యటనల సందర్భంగా ఆయా దేశాల ప్రధానుల్ని చంద్రబాబు ఆహ్వానించటం.. వారు రాకపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆహ్వానాన్ని మన్నించి శ్రీలంక ప్రధాని తెలంగాణకు వస్తే మాత్రం చంద్రబాబు చేయలేని పని కేటీఆర్ చేసినట్లు అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేనట్లే.