అమరావతికి రాళ్ళెత్తిన కూలీలు ....చరిత్ర కారులు !
అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.;
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాలాన్ని కలలను కలిపి కొలుస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతీ క్షణం కూడా ఎంతో విలువైనది అన్నది ఆయనకు బాగా తెలుసు. ఇదిలా ఉంటే అమరావతికి చట్టబద్ధత వచ్చింది. దాంతో ఇక అడ్డనుకు అన్నీ అధిగమించినట్లే అన్నది సైతం బాబు స్వయంగా చెప్పారు. దాంతో అమరావతి నిర్మాణాన్ని చూడాలని ఒక రూపు ఒక షేపుకి తీసుకుని వస్తే ఆనందించాలని కోట్లాది మంది ఏపీ జనాలలో మరింత ఎక్కువగా ఉంటుంది. దాంతో ప్రజల ఆలోచనలను ఆశలను గమనంలోకి తీసుకున్న చంద్రబాబు ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఫీల్డ్ లోకి వెంటనే దిగిపోయారు.
ఉన్నత స్థాయి సమీక్షతో :
అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తోన్న సంస్థల ప్రతినిధులు హాజరైన నేపధ్యంలో బాబు వారందరికీ దిశా నిర్దేశం చేశారు.ఈ సమీక్షలో బాబు అమరావతి పనుల విషయంలో ఏ టూ జెడ్ వివరాలను అన్నింటికీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్క విషయం వదిలిపెట్టకుండా అన్నీ వాకబు చేశారు. ఇక ఈ సమీక్షకు ఇక అమరావతి రాజధానిలో ప్రస్తుతం వివిధ దశలలో సాగుతోన్న 57,821 కోట్ల రూపాయల విలువైన పనులు గురించి బాబు పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు.
చరిత్రాత్మక ఘట్టంలో భాగం :
అమరావతి రాజధాని అన్నది ఒక చరిత్ర. రానున్న కొన్ని వందల ఏళ్ళకు ఈ రోజున పునాది పడుతోంది. అందుకే చంద్రబాబు ఈ నిర్మాణంలో భాగస్వాములు అయిన సంస్థలకు అలాగే ఈ పనులలో పాలుపంచుకుంటున్న వారికి ఒకటే చెప్పారు. అమరావతి నిర్మాణం అన్నది ఒక గొప్ప కార్యక్రమం. రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దు అని ఆయన హితవు చెప్పారు. ఈ రోజున పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టే అని బాబు స్పష్టం చేశారు. నిర్మాణ సంస్థలుగా అంతా ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదని బాబు వారికి చెప్పారు. అమరావతి రాజధానిని అద్భుతంగా వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది మీరే అంటూ న్రిమాణ సంథలను కోరారు ప్రస్తుతం రాజధానిలో పనులు చేస్తున్న వారుకీ 20 వేల మంది కార్మికులు నిపుణులు ఉన్నారని చెబుతున్నారు.
టార్గెట్లు పెట్టుకోవాలి :
అమరావతి రాజధాని నిర్మాణ పనులలో టార్గెట్లు పెట్టుకుని మరీ పనిచేయాలని బాబు కోరారు. వారానికి ఎంత అయింది నెల రోజులకు ఎంత అయింది అన్నది ఎప్పటికపుడు మధింపు చేయాలని ఆయన సూచించారు. వారం నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు. వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేయాల్సిన పనులపై స్పష్టత ఉండాలని కోరారు. అంతే కాదు నాణ్యతతో నిర్మాణాలు ఉండాలని, కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలని, గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలని బాబు సూచించారు అదే సమయంలో రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చునని బాబు చెప్పారు.
ఐకానిక్ భవనాల నిర్మాణం :
ఇంకో వైపు చూస్తే హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం పనులు అమరావతిలో ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది అన్నది బాబు ఆరా తీశారు, అదే విధంగా ఎంత మంది కార్మికులు పని చేయాలి ఎంత మంది పనిచేస్తున్నారుం ఎంత మిషనరీ ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తున్నారు అనే విషయంపై చబ్ద్రబాబ్య్ సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందే అని ఆయన కోరారు ఈ విషయంలో ఏమాత్రం రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే మ్యాన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలబు బాబు గట్టిగా కోరారు.