ఎగిరే విమానం... ఉత్తరాంధ్ర ప్రగతి రెక్కలు విచ్చుకుంటూ !

నిజం చెప్పాలీ అంటే అక్కడ ఎర్ర బస్సు కూడా ఆగేది కాదు, నాతవరం జంక్షన్ వద్ద ప్యాసింజర్ బస్సులలో ప్రయాణం చేస్తూ జనాలు రాకపోకలు సాగించేవారు.

Update: 2026-07-31 18:12 GMT

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. నిజం చెప్పాలీ అంటే అక్కడ ఎర్ర బస్సు కూడా ఆగేది కాదు, నాతవరం జంక్షన్ వద్ద ప్యాసింజర్ బస్సులలో ప్రయాణం చేస్తూ జనాలు రాకపోకలు సాగించేవారు. భోగాపురం ఎక్కడ అంటే మారుమూల అని జవాబు వచ్చేది. ఎక్కడో మూలను విసిరేసినట్లుగా ఉన్న ప్రదేశం అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటూ వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడచినా ఈ ప్రాంతానికి వైభోగం అయితే గతంలో ఎపుడూ రాలేదు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అయి మంత్రులు అయిన వారు ఉన్నారు. పక్కన ఉన్న భీమిలీకి ఉన్న పర్యాటక ప్రాముఖ్యత కూడా భోగాపురానికి లేకుండా పోయింది. మరి అన్ని విధాలుగా వెనకబడి దిగాలుపడుతున్న భోగాపురానికి ఇపుడు దశ తిరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక ఉత్తరాంధ్రను ప్రగతిపధంలో ఉంచేందుకు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలలో భాగంగా భోగాపురానికి ఏకంగా ఎయిర్ బస్సు వచ్చేసింది. గట్టి సంకల్పంతో పట్టుదలతో ఈ ప్రాంతాన్ని బాబు ఎంపిక చేశారు.

బాబు మార్క్ విజన్ తోనే :

విశాఖ ఎయిర్ పోర్టు విస్తరణకు ఇబ్బందిగా ఉంది. పైగా నేవీ కంట్రోల్ లో ఉంది. కొత్తగా ఎయిర్ పోర్టు అవసరం అనుకున్నప్పుడు బాబు ఏకంగా విశాఖను దాటి ఆలోచనలు చేశారు. ఉత్తరాంధ్ర నడిబొడ్డున ప్రగతి రెక్కలు మొలిస్తే ఎలా ఉంటుందో తనదైన అనుభవంతో దార్శనికతతో వినూత్నమైన ఆలోచనలు చేశారు. ఫలితంగానే అంతా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అన్న ఊహ పుట్టింది. నిజానికి ఆ ప్రతిపాదన చెప్పినపుడు చాలా మంది అదేంటి విశాఖ సిటీకి ఎక్కడో దూరంగా ఉంది అని అనుకున్నారు. ఒక రూరల్ సెక్టార్ లో భారీ ఎయిర్ పోర్టు ఏమిటి వర్కౌట్ అవుతుందా అని కూడా సందేహాలు వ్యక్తం చేశారు. కానీ బాబు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. ఈ రోజు నాలుగు వేల కోట్ల రూపాయలతో నాలుగు వేల ఎకరాలతో అద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు భోగాపురం కేంద్రంగా ఆవిర్భవించింది.

ఉత్తరాంధ్రాకు గేమ్ చేంజర్ :

ఉత్తరాంధ్రాలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. విశాఖ అర్బన్ తప్పించి మిగిలిన ప్రాంతాలు అన్నీ వెనుకబాటుతనానికి గురి అవుతూ వస్తున్నాయి. దాంతో భోగాపురం వద్ద ఎగిరే విమానం కేవలం ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చడమే కాదు ఉత్తరాంధ్రా ప్రగతి రధానికి అవసరమైన చోదక శక్తిగా బలంగా పని చేయనుంది అని అంటున్నారు. ఈ ఎయిర్ పోర్టు వల్ల అటు శ్రీకాకుళం, విజయనగరం అలాగే విశాఖ జిల్లాలు సమీప భవిష్యత్తులో కలసి పోయి ఒక్కటిగా నిలిచి అభివృద్ధిని గెలుస్తాయని అంటున్నారు. మరో శంషాబాద్ గా మారే కెపాసిటీ ఈ కొత్త ఎయిర్ పోర్టుకి ఉందని అంతా ఘంటాపధంగా చెబుతున్నారు.

ఉపాధి పెద్ద ఎత్తున పెరగనుంది :

కేవలం ఎయిర్ పోర్టు మాత్రమే కాకుండా ఎయిర్ ఫోర్స్ కి సంబంధిచి విద్యను అందుకునేలా భీమిలీ నియోజకవర్గం అన్నవరంలొ ఎయిర్ ఎడ్యుకేషన్ సిటీని కూడా నూటా అరవై ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మరో అయిదు వందల ఎకరాలలో భోగాపురం సమీపంలోనే విమానాశ్రయ సేవలకు సంబంధించి విడి భాగాల తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటి వల్ల ఉత్తరాంధ్రాలో ఉపాధి పెద్ద ఎత్తున పెరగనుంది. అలాగే అభివృద్ధి కూడా స్పీడ్ అందుకోనుంది. మొత్తానికి ఉత్తరాంధ్రను గగన తలం నుంచి తన ప్రగతి వీక్షణాలతో ఒక్కటిగా చేసి ఏపీలోనే కాదు దేశంలోనే దూసుకుని పోయే విధంగా కొత్త శక్తిని భోగాపురం ఎయిర్ పోర్టు అందిస్తుంది అనడంలో సందేహం లేదని నిపుణులు ప్రగతి కాముకులు గట్టిగా చెబుతున్నారు.

Tags:    

Similar News