తెలంగాణలో జనసేన దూకుడు.. ఏం చేస్తున్నారంటే..!
తెలంగాణలోనూ విస్తరిస్తామని.. ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన దరిమిలా.. జనసేన పార్టీ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి.
తెలంగాణలోనూ విస్తరిస్తామని.. ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన దరిమిలా.. జనసేన పార్టీ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఖమ్మంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ.. జనసేన నాయకులు , కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 5 వేల మంది కార్యకర్తలు ఈ కర్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నట్టు కార్యకర్తలు, నాయకులు ప్రకటించారు.
ప్రస్తుతం ఏపీ సరిహద్దు జిల్లాల్లో జనసేన పార్టీ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీలోకి కార్యకర్తల చేరికలు పెరుగుతున్నాయని నాయకులు చెబుతున్నారు. ఇదేసమయంలో రాజధాని హైదరాబాద్‌లో కూడా జనసేన కార్య క్రమాలను విస్తృతంగా అమలు చేసేందుకు నాయకులు రెడీ అయ్యారు. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ తరఫున పుంజుకునేలా ప్రత్యేక కార్యాచరణను కూడా సిద్ధం చేసినట్టు నాయకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో జనసేన పార్టీకి ఉమ్మడి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి జిల్లాలు కీలకంగా ఉన్నాయి. ఈ నేపథయంలో ఆయా జిల్లాల్లో పార్టీని పురోగమించేలా చేసేందుకు కార్యకర్తలను సమీకరిస్తున్నారు. పార్టీ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నెల 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని పలు జిల్లాల్లో రక్తదాన, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాల ప్రతులను కూడా ప్రజలకు పంచి పెట్టారు.
వ్యూహం ఏంటి?
ఇక, రాజకీయ వ్యూహం విషయానికివస్తే.. బలమైన కాంగ్రెస్, బీఆర్ ఎస్, బీజేపీ వంటివాటిని తట్టుకుని నిలబడాల న్నది పార్టీ నాయకుల ఆలోచన. ఆమేరకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. పార్టీ పరంగా కమిటీల నియామకాలు.. నిర్ణయాలు వంటివి ఇంకా జరగకపోవడంతో కొంత డీలా పడుతు న్నాయి. ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నాయకులు కోరుతున్నారు. గతంలో రద్దు చేసిన కమిటీలను పునరుద్ధరించాలని జనసేనానికి విన్నవిస్తున్నారు. ఇదే జరిగితే.. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.