లిక్కర్ నిషేధమా.. మందు తాగేవారి పరిస్థితి ఏంటి: బాంబే హైకోర్టు నిలదీత!
లిక్కర్‌ని నిషేధిస్తామని చెప్పేవారు ఎక్కడా లేరు. మహాత్ముడు పుట్టిన గుజరాత్ లోనే లిక్కర్ మాఫియా పెరిగిపో యిందని వార్తలు వస్తున్నాయి.
లిక్కర్‌ని నిషేధిస్తామని చెప్పేవారు ఎక్కడా లేరు. మహాత్ముడు పుట్టిన గుజరాత్ లోనే లిక్కర్ మాఫియా పెరిగిపో యిందని వార్తలు వస్తున్నాయి. ఇక, నిన్న మొన్నటి వరకు లిక్కర్‌పైనిషేధం ఉన్న బీహార్‌లోనూ ఇప్పుడు ఎత్తే స్తున్నారు. ఇలాంటి సమయంలో లిక్కర్ నిషేధిస్తామని చెప్పిన ముంబై పాలక వర్గాన్ని హైకోర్టు మందలించడం విశేషం. అలా ఎలా చేస్తారు? మందు తాగే వారి పరిస్థితిని కూడా అర్ధం చేసుకోండి.. అని వ్యాఖ్యానించడం.. గమనార్హం.
ఏం జరిగింది?
మహారాష్ట్ర రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో హైదరాబాద్, ముంబై నగరాల్లోనే భారీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి.. ఘనంగా ఈ గణపతి ఉత్సవాలు చేపడతారు. ఈ క్రమంలో ముంబై పరిధిలో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు, పోలీసుల సాయంతో మద్య నిషేధం చేయనున్నట్టు ప్రకటించారు. ఇది మొత్తం వినాయక చవితి ఉత్సవాలు ముగిసే పది రోజుల పాటు అమల్లో ఉంటుందని పేర్కొ న్నారు. దీనికి సంబంధించి అన్ని షాపులకునోటీసులు కూడా ఇచ్చారు.
అయితే.. ఈ వ్యవహారంపై కలత చెందారో ఏమో.. పలువురుమద్యం ప్రియులు హైకోర్టును ఆశ్రయించారు. మద్య నిషేధాన్ని ఎత్తేయాలని.. అధికారులు అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు వివరించారు. దీనిని విచార ణకు స్వీకరించిన ముంబై హైకోర్టు.. అధికారులనుంచి వివరణ తీసుకుంది. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో నే తాము నిషేధం విధించామని.. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వారు కోర్టుకు వివరించారు.
ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని.. ఎంత శాంతి భద్రతల సమస్య అయితే మాత్రం 10 రోజుల పాటు మద్యం షాపులను మూసేస్తే ఎలా? అని అధికారులను నిలదీసింది. మద్యానికి అలవాటు పడినవారు.. ఫంక్షన్లు చేసుకునే వారి సంగతిని ఆలోచించారా? అని ప్రశ్నించింది. ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో మద్యం ప్రియులు, మద్యానికి అలవాటైన వారి ఆరోగ్యంతో ఆడుకోవద్దని కోర్టు హెచ్చరించింది. దీంతో అధికారులు తమ నిర్ణయాన్ని రెండు రోజులకే పరిమితం చేశారు. అయితే.. మద్యం ప్రియులు అలజడి సృష్టిస్తే.. కేసులు నమోదు చేయొచ్చని కోర్టు వెసులుబాటు కల్పించింది. పూర్తిగా మద్యాన్ని నిషేధించడానికి విముఖత వ్యక్తం చేసింది.