అనంత టీడీపీ సైలెంట్.. రీజనేంటి..!
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని ఇతర నియో జకవర్గాలతో పోల్చుకుంటే.. ఆది నుంచి టీడీపీకి ఈ జిల్లా అండగా ఉంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని ఇతర నియో జకవర్గాలతో పోల్చుకుంటే.. ఆది నుంచి టీడీపీకి ఈ జిల్లా అండగా ఉంది. వైసీపీ హవా కనిపించిన 2019 లో కూడా.. హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో టీడీపీ ఘన విజయం దక్కించుకుంది. గత ఎన్నికలలో మరింత పట్టు పెంచుకుంది. అయితే.. వ్యక్తిగత కారణాలు కావొచ్చు.. లేదా పదవులు దక్కలేదన్న ఆవేదన కావొచ్చు.. నాయకులు ఇప్పుడు పూర్తి సైలెంట్ అయిపోయారు.
ముఖ్యంగా కొందరు సీనియర్లు మంత్రి పదవులు దక్కకపోవడంలో అసంతృప్తిలో ఉన్నారు. అదేసమ యంలో తమ వారికి నామినేటెడ్ పదవులను కేటాయించడంలోనూ జాప్యం జరుగుతుండడంతో వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న చర్చ ఉంది. ఇక, నాయకుల మధ్య సమన్వయ లోపం ఇతర చోట్ల ఉన్నట్టుగానే ఇక్కడ కూడాకనిపిస్తోంది. దీంతో ఎవరికివారే యమునా తీరుగా వ్యవహరించ డంతో గత ఎన్నికల తర్వాత ఆశించిన స్థాయిలో ఇక్కడ టీడీపీ పుంజుకోలేక పోతోంది. ఇక, నాయకుల తీరుతో. కేడర్‌లోనూ నిరాసక్తత కనిపిస్తోంది.
ఇంటింటికీ ఎలా ఉంది?
ఇక, టీడీపీ అదినేత చంద్రబాబు ఆదేశించిన ఇంటింటికీ కార్యక్రమం కూడా జిల్లాలో చప్పగానే సాగుతోం ది. మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ, కాల్వ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహి స్తున్న రాయదుర్గంలో కొంత మేరకు ఫర్వాలేదు అన్నట్టుగా ఉన్నా.. కీలకమైన మరిన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమానికి నాయకులు శ్రీకారం చుట్టలేదు. మిగిలిన నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు. కార్యకర్తల మోహరింపు వంటి వాటిపైనే దృష్టి పెట్టారు. దీంతో ఇంటింటికీ కార్యక్రమం జోష్ కనిపించడం లేదు.
సమన్వయం పెద్ద సమస్య
అనంతపురంలో దాదాపు అందరూ సీనియర్ నాయకులే ఉండడంతో సమన్వయం పెద్దగా కనిపించడం లేదు. ఎవరికివారు తమ మాటే నెగ్గాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇక, నియోజ కవర్గంలో ఆధిపత్య జోరు కూడా పెద్దగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ నాయకులు అన్నట్గుగా ఈ వ్యవ హారం ముందుకు సాగుతోంది. దీంతో కేడర్‌లోనూ అసంతృప్తి నెలకొంది. మరీ ముఖ్యంగా తాడిపత్రి, హిందూపురం, పెనుకొండ వంటి నియోజకవర్గాల్లో రాజకీయాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. ఈ పరిణామాలను సరిచేయాల్సిన అవసరం ఉందన్న టాక్ వినిపిస్తోంది.