వెంటాడిన ప్రమాదం.. ఆస్ట్రేలియాలో విశాఖకు చెందిన అత్తాకోడళ్లు దుర్మరణం

ఆస్ట్రేలియాలో జరిగిన ఒక విషాద రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాన్ని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Update: 2026-09-18 10:13 GMT

ఆస్ట్రేలియాలో జరిగిన ఒక విషాద రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాన్ని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెల్‌బోర్న్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అత్తాకోడళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మెల్‌బోర్న్‌లోని పామర్స్ రోడ్‌పై ఈ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన వీఎన్‌సీ (వీడీసీ) మాజీ జాయింట్ సెక్రటరీ జీటీ ప్రసాద్, ఆయన భార్య ఇటీవల ఓ కుటుంబ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి టయోటా కారులో ప్రయాణిస్తుండగా.. వేగంగా వచ్చిన పోర్షే వాహనం వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు తీవ్రంగా ధ్వంసమై.. జీటీ ప్రసాద్ భార్యతో పాటు ఆయన కోడలు నేహా అక్కడికక్కడే మృతి చెందారు. కళ్లముందే భార్య, కోడలు అనంత లోకాలకు వెళ్లడంతో ప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

పరిస్థితి తీవ్రం.. విచారణ వేగవంతం

కారు నడుపుతున్న డ్రైవర్ తీవ్ర గాయపడటంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. విక్టోరియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాద తీవ్రత, వాహనాల వేగం, సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ నిమిత్తం పామర్స్ రోడ్డును అధికారులు కొంతసేపు మూసివేశారు. పోర్షే వాహన డ్రైవర్ విచారణకు సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కమ్యూనిటీ నివాళులు.. సహాయక చర్యలు

ఈ హృదయ విదారక సంఘటనతో ఆస్ట్రేలియాలోని తెలుగు సమాజంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మెల్‌బోర్న్ తెలుగు ఎన్నారై సంఘాలు, స్థానిక కమ్యూనిటీ నాయకులు బాధితుడికి అండగా నిలిచారు. పార్థివ దేహాలను వీలైనంత త్వరగా విశాఖపట్నం తరలించేందుకు అవసరమైన రాయబార కార్యాలయ ప్రక్రియలను, చట్టపరమైన సహాయాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News