ఫస్ట్ టైమ్.. మంత్రిగారికి మంచి ఛాన్స్.. !
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించనున్నారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించనున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో హైలెట్ అవుతోంది.. స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. పూర్తి బాధ్యతలను ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నా .. జిల్లాకు చెందిన మంత్రిగా కొండపల్లికి కూడా చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇప్పుడు ఆయన క్షణం తీరికలేకుండా.. ఈ పనిపైనే ఉన్నారు.
గత ఎన్నికల్లో గజపతి నగరం నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం సాధించిన కొండపల్లి ఇదే సమయంలో చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే.. ఇతర మంత్రులకు ఈయనకు చాలా భిన్నమైన వాతావరణం ఉంది. సీఎం చంద్రబాబు అంచనాలకు అనుగుణంగా.. ఆయన ప్రణాళికలకు కూడా అనుగుణంగా కొండపల్లి వ్యవహరిస్తున్నారు. సెర్ఫ్ శాఖకు మంత్రిగా ఉండడంతో మహిళల కు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుంచి వారికి అవసరమైన అన్ని విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ విషయంలో మంత్రి కొండపల్లి సక్సెస్ అయ్యారు. చంద్రబాబు దగ్గర కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి నిర్వహించే సభ.. ప్రధాన మంత్రి ఆహ్వాన కార్యక్రమం వంటి కీలక బాధ్యతలను మంత్రికి అప్పగించారు. మంత్రి లోకేష్ సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో కొండపల్లికి కూడా కీలక బాధ్యతలు ఇచ్చారు. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరుకావడం మరో కీలక అంశంగా మారింది.
ఈ నేపథ్యంలో తొలిసారి మంత్రి పగ్గాలు చేపట్టినా.. ఆయనలోని సత్తాను గ్రహించిన చంద్రబాబు కొండ పల్లికే కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఆహ్వాన పత్రికల ముద్రణ నుంచి.. కార్యక్రమాల నిర్వ హణ వరకు అన్నీ.. లోకేష్ పర్యవేక్షణలో మంత్రి నిర్వహించేలా ప్రణాళికను చేశారు. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలను గమనిస్తే.. పక్కా ప్రణాళికతో మంత్రి వ్యవహరించారు. ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా చేస్తున్నారు. పూర్తిస్థాయి సమయం ఆయన ఈ కార్యక్రమానికే కేటాయించడం గమనార్హం. ఒకవైపు మంత్రుల బృందం ఉన్నా.. మరోవైపు కొండపల్లిపై చంద్రబాబు ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం గమనా ర్హం. బాబు ఆశలు నెరవేర్చేందుకు కొండపల్లి కూడా అంతే ఇంట్రస్టుతో పనిచేస్తుండడం గమనార్హం.