ఏజింగ్ సమస్యకు కొత్త సొల్యూషన్.. గ్లోబల్ మోడల్‌గా మారిన దేశం!
ఆసియా దేశాలకు జపాన్ అందిస్తున్న ఈ రోల్ మోడల్ మరియు సరికొత్త పాఠాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల గురించి మాట్లాడుకుంటుంటే, మరోవైపు వృద్ధుల సంఖ్య పెరగడం అనేది పెద్ద సామాజిక సవాలుగా మారుతోంది. అయితే ఈ వృద్ధాప్య సమస్యను ఒక సంక్షోభంలా చూడకుండా, అద్భుతమైన అవకాశంగా మార్చుకుంది జపాన్. వృద్ధులను సమాజానికి భారంగా భావించకుండా, వారి అనుభవాన్ని ఒక శక్త్యత్మక ఆస్తిగా మార్చడమే కాకుండా వృద్ధాప్య సంరక్షణను ఒక గ్లోబల్ ఇండస్ట్రీగా తీర్చిదిద్దింది. ఆసియా దేశాలకు జపాన్ అందిస్తున్న ఈ రోల్ మోడల్ మరియు సరికొత్త పాఠాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సమస్య కాదు.. సామాజిక ఆస్తి:
చాలా దేశాల్లో వృద్ధాప్యం అనగానే పెన్షన్లు, మెడికల్ ఖర్చులు పెరిగే భారం అనే కోణంలోనే ఆలోచిస్తారు. కానీ జపాన్ ఈ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. సీనియర్ సిటిజన్లను కేవలం విశ్రాంతి తీసుకునేవారిగా కాకుండా, వారిలోని నైపుణ్యాన్ని తిరిగి సమాజానికి ఉపయోగపడేలా చేసే ప్రత్యేక కార్యక్రమాలను తెచ్చింది. ఇక విశ్రాంత ఉద్యోగులను కొత్త తరం యువతకు మార్గదర్శకులుగా, స్థానిక కమ్యూనిటీ సర్వీసుల్లో భాగస్వాములుగా మార్చి ఒక కొత్త విప్లవానికి తెరలేపింది.
జెరియాట్రిక్ ఇన్నోవేషన్:
వృద్ధుల సంరక్షణ కోసం జపాన్ సాంకేతికతను మరియు వైద్య రంగాన్ని అనుసంధానించిన తీరు అద్భుతం. దీనినే 'జెరియాట్రిక్ ఇన్నోవేషన్' అని పిలుస్తున్నారు. ఇక వృద్ధులకు సహాయంగా ఉండే కేర్‌గివింగ్ రోబోట్లు, సులభంగా నడవడానికి తోడ్పడే పరికరాలు మరియు అధునాతన హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. ఈ సాంకేతికత జపాన్‌లోనే కాకుండా, ప్రపంచ మార్కెట్‌లోనూ కోట్లాది డాలర్ల వ్యాపారంగా మారి ఆ దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తోంది.
భారత్‌కు నేర్పించే పాఠాలు:
ప్రస్తుతం మన భారతదేశం యవ్వనంలో వున్నా వారి సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ, మరో రెండు మూడు దశాబ్దాల్లో మన దేశంలో కూడా వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. మన దగ్గర కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పటికీ, మారుతున్న జీవనశైలి వల్ల వృద్ధుల ఆరోగ్య సంరక్షణ ప్రధాన సమస్యగా మారుతోంది. ఇక జపాన్ తరహాలోనే మనం కూడా ఇప్పటినుంచే ప్రాథమిక హెల్త్‌కేర్, ఆటోమేషన్ మరియు వృద్ధులకు అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేసుకోవడం చాలా అవసరం.
సంరక్షణే ఒక పరిశ్రమ:
వృద్ధుల సంరక్షణను కేవలం ఒక సేవగా మాత్రమే కాకుండా, 'సిల్వర్ ఎకానమీ' పేరుతో ఒక పెద్ద పరిశ్రమగా మలిచింది జపాన్. సీనియర్ ఫ్రెండ్లీ గృహాలు, ప్రత్యేక డైట్ ఫుడ్స్, మరియు వ్యాయామ కేంద్రాలు వంటివి అక్కడ పెద్ద వ్యాపార రంగాలుగా అభివృద్ధి చెందాయి. ఇక ఇది ఆర్థికంగా కొత్త ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా, సీనియర్ సిటిజన్లు స్వతంత్రంగా మరియు గౌరవప్రదంగా బ్రతకడానికి తోడ్పడుతోంది.
ముందస్తు ప్రణాళికే సమాధానం:
వృద్ధాప్యం అనేది ప్రతి మనిషికి, ప్రతి దేశానికి తప్పనిసరిగా వచ్చే ఒక సహజమైన దశ. దాన్ని చూసి భయపడటం లేదా ఉపేక్షించడం కాకుండా, ఒక పక్కా విజన్‌తో ముందస్తు ప్లానింగ్ చేసుకోవడమే నిజమైన పరిష్కారం. ఇక జపాన్ వేసిన బాటను అనుసరిస్తూ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా వృద్ధాప్య సంరక్షణకు అవసరమైన మౌలిక వసతులను ఇప్పుడే ఏర్పాటు చేసుకోవడం భవిష్యత్తుకు ఎంతో శ్రేయస్కరం.