దీన‌ర్థం బీజేపీకి ద‌గ్గ‌ర‌మ‌డమేనా కేటీఆర్ గారు?!

Update: 2017-09-10 04:42 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు - మంత్రి కేటీఆర్ రాజ‌కీయాల్లో బాగా రాటుదేలుటున్న‌ట్లుందని అంటున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ లాగే ఏ సంద‌ర్భంలో ఏ అస్త్రం ప్ర‌యోగించాలో అదే రీతిలో ఆయ‌న త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ న‌డుచుకుంటున్నార‌ని అంటున్నారు. గ‌తంలో కేవ‌లం ప‌రిపాల‌న ప‌ర‌మైన అంశాల్లోనే త‌న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ కేటీఆర్ ఇప్పుడు రాజ‌కీయాల్లో సైతం చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారే చ‌ర్చ సాగుతోంది. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్ద‌ల మ‌న‌సును దోచుకునేలా కేటీఆర్ అడుగులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హిందూ మ‌తాభిమాని అయితే...మంత్రి కేటీఆర్ దానికి భిన్నం. ఇంకా చెప్పాలంటే ఆయ‌న నాస్తికుడు అనుకోవ‌చ్చు. సీఎం కేసీఆర్ చేసే యాగాలు మొదలుకొని పూజ‌ల వ‌ర‌కు కేటీఆర్ క‌నిపించ‌డం త‌క్కువ‌గా ఉండ‌టం ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్తుంటారు. అంతేకాదు త‌న వ్య‌క్తిగ‌త‌ - అధికారిక కార్య‌క్ర‌మాల్లో కూడా ఆధ్యాత్మిక‌ప‌ర‌మైన అంశాల‌కు దూరంగా ఉంటారు. కొద్దికాలం క్రితం అమ‌వాస్య రోజు అలాంటి కేటీఆర్ బీజేపీ నేత‌ల ద‌గ్గ‌ర భ‌క్తిభావాన్ని ప్ర‌ద‌ర్శించారు. అందులోనూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ టీంలో కీల‌క స‌భ్యురాలిగా ఉన్న కేంద్ర‌మంత్రి - ఇటీవ‌లే రక్ష‌ణ మంత్రి బాధ్య‌త‌లు స్వీక‌రించిన తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామ‌న్ వ‌ద్ద‌.

గ‌త కొద్దికాలంగా స‌హ‌జంగా ఎవ‌రైనా క‌లిస్తే చేనేత వ‌స్త్రాల‌ను ఇవ్వ‌డ‌మో లేదా సాధార‌ణ బొకేలు ఇవ్వ‌డ‌మో చేస్తున్న మంత్రి కేటీఆర్ ర‌క్ష‌ణ‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ విష‌యంలో మాత్రం కొత్త సిద్ధాంతం ఫాలో అయ్యారు. ఆవు ప్ర‌తిమ‌ను అందించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేపారు. బీజేపీ నేత‌లు ఆవును గోమాత‌గా భావిస్తుంటారు. గోమాత సంర‌క్ష‌ణ‌కు కూడా బీజేపీ నేత‌లు పెద్ద‌పీట వేస్తార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. హిందుత్వ సిద్ధాంతాల ప్ర‌కారం కూడా గోమాత‌ను పూజిస్తారు. అలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఆధ్యాత్మిక భావ‌న‌కు దూరంగా ఉండే మంత్రి కేటీఆర్ కేంద్ర ర‌క్ష‌ణ మంత్రికి గోవు ప్ర‌తిమ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

కొస‌మెరుపుః ర‌క్ష‌ణ‌మంత్రి నిర్మలా సీతారామ‌న్ కంటే ముందు కేంద్ర మంత్రులు సురేశ్ ప్ర‌భు - స్మృతీ ఇరానీ - అశోక్‌ గ‌జ‌ప‌తిరాజుల‌ను కేటీఆర్ క‌లిశారు. వారికి సంప్ర‌దాయ‌మైన బొకేలు అప్ప‌గించిన క‌లిసి వ‌చ్చిన కేటీఆర్‌..కేవ‌లం కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ కు మాత్రం ఆవు ప్రతిమ ఇవ్వ‌డం వెనుక మ‌ర్మం ఏమిటా అని ప‌లువురు ఆలోచిస్తున్నారు.
Tags:    

Similar News