అజిత్ పవార్ సతీమణికి షాక్ ఇచ్చిన కాంగ్రెస్
ఇక అజిత్ పవార్ ఒక విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. దీంతో ఇలాంటి సందర్భాలలో విపక్షాలు అయితే తమ అభ్యర్ధిని నిలబెట్టే ప్రయత్నం చేయవు, ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది.;
మహారాష్ట్రలో బలమైన నాయకుడిగా అజిత్ పవార్ ఉంటూ వచ్చారు. నాలుగు దశాబ్దాల పైబడిన రాజకీయ జీవితంలో ఎన్నో సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన చివరికి ముఖ్యమంత్రి కాకుండానే ఈ ఏడాది జనవరి చివరిలో బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. దాంతో ఆయన పార్టీ ఎన్సీపీ పవార్ కి కొత్త నాయకురాలిగా అజిత్ సతీమణి సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించారు. అంతే కాదు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆమె స్వీకరించారు ఆమె రాజ్యసభ మెంబర్ గా ఉండేవారు. అయితే అజిత్ పవార్ మరణంతో బారామతి సీటు ఖాళీ కావడంతో అక్కడ నుంచి ఆమె ఉప ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు.
ఏకగ్రీవం అనుకుంటే :
ఇక అజిత్ పవార్ ఒక విమాన ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. దీంతో ఇలాంటి సందర్భాలలో విపక్షాలు అయితే తమ అభ్యర్ధిని నిలబెట్టే ప్రయత్నం చేయవు, ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. కానీ బారామతి సీటు విషయంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం పోటీకి సై అంటోంది. అజిత్ పవార్ సతీఎమణి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ మీద పోటీ చేయాలని గట్టి నిర్ణయం తీసుకోవడం ఒక విధంగా షాకింగ్ పరిణామంగా
చూస్తున్నారు. దీంతో మహారాష్ట్రలోని ప్రతిష్టాత్మక బారామతి స్థానానికి జరగనున్న కీలక ఉప ఎన్నికలలో ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్కి పోటీగా కాంగ్రెస్ పార్టీ ఆకాష్ మోరేను బరిలోకి దింపింది. దీంతో ఈ ఉప ఎన్నిక ఇపుడు ఉత్కంఠను కలిగిస్తోంది.
ఇండియా కూటమి మద్దతు :
కాంగ్రెస్ తన అభ్యర్ధిని పోటీకి పెడితే కచ్చితంగా ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీ , అలాగే ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి. దాంతో ఏకగ్రీవం అనుకున్న చోట అధికార ఎన్డీయే సైతం కూడా రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ అజిత్ సతీమణి తొలిసారి బారామతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు అన్నది కేవలం అజిత్ పవార్ పార్టీకే కాదు మహారాష్ట్రను ఏలుతున్న ఎన్డీయేకు కూడా కీలకంగా మారుతోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్వవీస్ కూడా ఈ ఉప ఎన్నికల మీద ఫోకస్ పెట్టాల్సి ఉంది.
సానుభూతి వర్కౌట్ అవుతుందా :
బారామతి అంటే అజిత్ పవార్ కి కంచుకోట లాంటిదే. ఆయన అనేక సార్లు అక్కడ నుంచి గెలిచారు. చివరి సారి కూడా అక్కడికి వస్తూండగానే దుర్మరణం పాలు అయ్యారు. ఇక ఆయన మరణించిన మూడు నెలల తేడాలోనే ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి సానుభూతి కూడా వర్కౌట్ అవుతుందని అజిత్ పవార్ ఎన్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో బారామతి మీద ఎన్సీపీ వృద్ధ నేత శరద్ పవార్ కి కూడా పట్టు ఉంది. కాంగ్రెస్ కి బలం ఉంది. దాంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఈ ఉప ఎన్నికలు జరుగుతాయా అన్న చర్చ అయితే మొదలైంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.