ఊహించని పేరు : మోడీ కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా?

దేశంలో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్లకు ఏమాత్రం కొదవ ఉండదు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పీఠం ఖాళీ చేయగానే... "తర్వాతి హెడ్‌మాస్టర్ ఎవరు?" అంటూ సోషల్ మీడియా, మీడియా చానెల్స్ అప్పుడే బెంచ్ మీద ఎక్కి రచ్చ మొదలెట్టేసాయి.

Update: 2026-07-25 17:21 GMT

దేశంలో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్లకు ఏమాత్రం కొదవ ఉండదు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పీఠం ఖాళీ చేయగానే... "తర్వాతి హెడ్‌మాస్టర్ ఎవరు?" అంటూ సోషల్ మీడియా, మీడియా చానెల్స్ అప్పుడే బెంచ్ మీద ఎక్కి రచ్చ మొదలెట్టేసాయి.

మధ్యలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరును స్క్రీన్ మీదకి తెచ్చి "ఇదిగోండి, రేపో మాపో ఈయనే క్లాస్ తీసుకోబోతున్నారు" అని గట్టిగా లీకులు ఇచ్చేశారు. దాంతో మన పడ్నవీస్ గారు ఖంగుతిని... "అయ్యా సామీ! నన్ను విద్యాశాఖ మంత్రిని చేయడానికి మీరేమైనా ఆర్డర్ పాస్ చేశారా? వార్తలు రాసేటప్పుడు కాస్త అడిగి రాయండయ్యా!" అంటూ మీడియా ప్రతినిధులకు స్వీట్ ఆన్సర్ ఇచ్చి క్లారిటీ ఇచ్చేసరికి అంతా మళ్లీ మొదటికొచ్చింది.

ఈ ఉత్కంఠకు తెర దించుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనూహ్యంగా తన మార్క్ ట్విస్ట్ ఇచ్చారు. విద్యాశాఖ కొత్త బాధ్యతలను ప్రహ్లాద్ జోషి గారి చేతిలో పెట్టేశారు!

ఎవరు ఈ ప్రహ్లాద్ జోషి?

కర్ణాటకలోని ధార్వాడ్ పార్లమెంట్ స్థానం నుంచి 2004, 2009, 2014, 2019, 2024... ఇలా వరుసగా ఐదుసార్లు గెలిచి నాన్-స్టాప్ విక్టరీ కొట్టిన రికార్డు ఈయనది. తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. ఆర్ఎస్ఎస్ తో బలమైన అనుబంధం ఉంది. బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాలు, ఆహార-ప్రజా పంపిణీ శాఖలు... ఇలా ఏ శాఖ ఇచ్చినా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోవడం జోషి గారి నైజం. మరి మోడీ గారి మనస్సు ఈయన మీదికే ఎందుకు వెళ్లిందంటే? వివాదాలకు దూరంగా ఉంటూ కష్టకాలంలో పక్కా ప్లానింగ్‌తో పని పూర్తి చేయడమే ఆయన ప్లస్ పాయింట్.

పక్షంలో జోషి గారి ముందున్న అసలు 'ఎగ్జామ్'!

విద్యాశాఖ అంటే ఇప్పట్లో మామూలు విషయం కాదు.. పేపర్ లీకేజీలు, వివాదాలు, ఒత్తిళ్లతో ఎప్పుడూ 'హాట్ సీట్'లా కాలుతూనే ఉంటుంది. మరి ఇప్పటివరకు పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు గనులను నడిపిన జోషి గారు, ఈ 'విద్యాశాఖ' అనే క్లిష్టమైన ఎగ్జామ్‌ను ఎలా పాస్ అవుతారో విద్యార్థుల-రాజకీయ విశ్లేషకుల మార్కులను ఎలా సంపాదిస్తారో వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News