కరోనాపై తెలంగాణ టెక్ బాణం!

Update: 2020-04-06 14:52 GMT
కరోనా కంటే దాని చుట్టూ క్రియేటవుతున్న ఫేక్ వార్తలు ప్రభుత్వాలను ఎక్కువ భయపెడతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పుకార్లు పుట్టించేవాళ్లు ఆగడం లేదు. అరెస్టులు చేస్తున్నా తగ్గడం లేదు. అందుకే ప్రజలు ప్రభుత్వానికి వారధిగా టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఈ పుకార్ల ప్రభావాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం విపరీతంగా కృషి చేస్తోంది. వదంతులు నమ్మవద్దు అంటూ ఒకవైపు ప్రజలకు పిలుపునిస్తూనే నిజాలను ప్రజలకు చేరవేయడానికి నిరంతరాయంగా ప్రయత్నం చేస్తోంది.

కొద్ది రోజుల క్రితం... ఏది ఫేక్.. ఏది నిజం అని తెలుసుకోవడానికి ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిన తెలంగాణ సర్కారు తాజాగా వాట్సాప్ సౌజన్యంతో  నేరుగా ధృవీకరించిన సమాచారాన్ని ప్రభుత్వం నుంచి పొందడానికి ఒక అవకాశం కల్పించింది. దీనికోసం ప్రజలు విసృతంగా వాడే వాట్సప్ ను వేదిక చేసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం “TS Gov Covid Info” పేరుతో ఒక వాట్సాప్ చాట్ బాట్ ను సోమవారం ప్రారంభించింది. ఇది 9000 658 658 నెంబరుపై అందుబాటులో ఉంటుంది. హైదరాబాదుకు చెందిన ఎస్.బి. టెక్నాలజీస్ సంస్థ సాయంతో ప్రభుత్వం దీనిని రూపొందించింది. దీనినిసోమవారం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలు సరైన సమాచారం తెలుసుకోవడానికి ఇది సరైన వేదికన్నారు. దీనిని ఐటీ శాఖ - వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి.  ప్రజలు కరోనాకు సంబంధించి తమకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ నెంబరులో చాట్ చేసి తెలుసుకోవచ్చు. వాట్సప్ మాత్రమే కాకుండా మెయిల్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు. covid19info-itc@telangana.gov.in ఐడీకి మీ సందేహాలను పంపితే వారు సరైన సమాధానం మీకు తెలియజేస్తారు.

తెలంగాణ ప్రభుత్వం కరోనాపై ఏ నిర్ణయాలు తీసుకుంది - లాక్ డౌన్ సమాచారం - ఎస్సెన్షియల్ కొనుగోళ్లు - అత్యవసర ప్రయాణాలు వంటి ఏ సందేహాలు అయినా ఇక్కడ నేరుగా ప్రభుత్వాన్ని అడగొచ్చు. ప్రభుత్వం ఎటువంటి ఆలస్యం లేకుండా మీకు సహాయపడుతుంది.
Tags:    

Similar News