ఢిల్లీలో కేటీఆర్.. సేమ్ సీన్ రిపీట్

Update: 2019-10-31 04:19 GMT
పాత సీనే.. సేమ్ టు సేమ్.. మరోమారు ఢిల్లీ వేదికగా రిపీట్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తన ఢిల్లీ టూర్ లో బిజీబిజీగా కలిశారు. గతంలో కలిసిన మంత్రుల్నే మళ్లీ కలిసిన ఆయన పాత డిమాండ్లను మరోసారి తెర మీదకు తీసుకొచ్చి వినతుల మీద వినతులు చేశారు. తన పర్యటన ఎంతో ఉత్సాహంగా సాగినట్లు చెప్పినప్పటికీ.. తాను కలిసిన ఏ కేంద్రమంత్రి కూడా తన వినతులకు పాజిటివ్ గా స్పందించి.. ఫలానా టైంలోపు మీ పని పూర్తి చేస్తానన్న మాటను మాత్రం చెప్పించుకోలేకపోయారని చెప్పాలి.

తన ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన ఆయన.. హైదరాబాద్ లోని రక్షణ శాఖకు చెందిన భూములను తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. హైదరాబాద్ - నాగపూర్.. హైదరాబాద్ - రామగుండం జాతీయ రహదారుల్ని విస్తరించటానికి నగరంలోని రక్షణ శాఖ భూముల్ని ఇవ్వాల్సిందిగా కోరారు. బోయిన్ పల్లి మార్గంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఎన్ హెచ్ 1.. ఎన్ హెచ్ 44 రోడ్లను విస్తరించాలని.. స్కైవేస్ నిర్మించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రమంత్రి రాజ్ నాథ్ కు కేటీఆర్ చెప్పారు. ఇదే విషయాన్ని గతంలోనూ పలుమార్లు కేంద్రం వద్దకు వెళ్లటం.. ఇప్పటివరకూ ఏమీ కాకపోవటం తెలిసిందే.

తాజాగా మరోసారి.. పాత వినతుల్ని తీసుకొని కొత్తగా రిక్వెస్ట్ చేశారు కేటీఆర్. తమ అధీనంలోని భూముల్ని తమకు ఇస్తే.. అందుకు ప్రతిగా తాము భూమి ఇస్తామన్న పాత మాటను మరోసారి కేటీఆర్ నోట వచ్చింది. ఆయన చెప్పిన మాటల్ని విన్న కేంద్రమంత్రులు.. అలాగే అన్న మాట తప్పించి.. తప్పనిసరిగా పూర్తి చేద్దామన్న మాట మాత్రం చెప్పినట్లు లేదన్న మాట వినిపిస్తోంది. నిజానికి 40 ఎకరాల భూమిని రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయితే.. ఇన్నేళ్లుగా  అడిగించుకోవాల్సిన అవసరం ఉంటుందా? గంటల్లో ఒక్క సంతకంతో పూర్తి అయ్యే పనిని.. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అడిగినా స్పందించటం లేదంటే.. వారా విషయంలో పాజిటివ్ గా లేరన్న విషయాన్ని కేటీఆర్ ఎందుకు అర్థం చేసుకోరంటారు?
Tags:    

Similar News