యంగ్ లీడర్స్ అంతా యువనేత దగ్గరకే..
దేశవ్యాప్తంగా కుర్ర నేతలకు మంచి కాలం మొదలవుతోంది. వృద్ధ జంబూకాల రాజకీయ జీవితాలకు పుల్ స్టాప్ పడే రోజులు కనిపిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీలో తండ్రీకొడుకులు ములాయం సింగ్ - అఖిలేశ్ యాదవ్ ల మధ్య పోరు తెలిసిందే. ఈ పోరులో పార్టీ ఎమ్మెల్యేలు ప్రజలు అంతా అఖిలేశ్ వెంటే ఉన్నారు. అఖిలేశ్ మీటింగు పెడితే 229 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 200 మందికిపైగా ఆయన వైపే వచ్చారు. పార్టీ మొత్తం ఆయన గ్రిప్ లోనే ఉంది. ఇలాంటి చీలికలు - తిరుగుబాట్లు ఏపీలో లేకున్నా రాజకీయ నేతల కుమారులు మాత్రం తమ తండ్రులు ఉన్న పార్టీలను వీడీ తమకు నచ్చిన పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి తండ్రులూ వారివెంటే నడుస్తున్నారు. కొందరు మాత్రం కొడుకులను పంపించి తాము మాత్రం ఉన్న పార్టీలోనే కొనసాగుతున్నారు.
తాజాగా మాజీమంత్రి - టీడీపీ దివంగత నేత కోటగిరి విద్యాధరరావు కుమారుడు కోటగిరి శ్రీధర్ వైసీపీలో చేరబోతున్నారు. ఈనెల 29న ఆయన ద్వారక తిరుమలలో జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. విద్యాధరరావు గతంలో కాంగ్రెస్ - టీడీపీల్లో పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టున్న ఈ కుటుంబం చేరిక జగన్ కు ప్లస్ పాయింటే.
కాగా ఇటీవల గుంటూరు జిల్లాలో కాసు కృష్ణారెడ్డి కుమారుడు మహేశ్ రెడ్డి కూడా వైసీపీలో చేరారు. మరోవైపు టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి కుమారుడు కూడా వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా చాలామంది నేతల కుమారులు ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/