అంతిమయాత్ర కాదు - టీడీపీ విజయోత్సవ ర్యాలీ!

Update: 2019-09-19 07:06 GMT
కోడెల మరణాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతగా రాజకీయంగా వాడుకుంటోందో ఆయన అంతిమయాత్రతో మరింత స్పష్టత వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. కోడెల బతికి ఉన్నప్పుడు ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబు నాయుడు - ఆయన మరణించడంతో.. ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో.. తనకు ఒక అవకాశం వచ్చిందని భావిస్తున్నట్టున్నారని పరిశీలకులు అంటున్నారు. కోడెల కుటుంబ వ్యవహరాలపై రచ్చ కొత్తది ఏమీ కాదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కోడెల కూతురు - కొడుకులు సాగించిన దందాలు అప్పటి నుంచి చర్చలోనే నిలుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ కారణాలే ఎక్కువనే అభిప్రాయాలు ఏర్పడుతూ ఉన్నాయి ప్రజల్లో. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కోడెల మీద కేసులు పెట్టారంటూ.. రాజకీయం చేస్తూ ఉన్నారు. కోడెల కుటుంబం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు అడ్డగోలు వాదనలు చేసి.. రాజకీయం చేస్తున్నారు.

ఇక కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు నాయుడు హావభావాలు మరింత చర్చనీయాంశంగా మారాయి. కోడెల మరణించారనే బాధ అక్కడ చంద్రబాబులో కనిపించలేదు. ఒకవేళ బాధ ఉంటే.. చంద్రబాబు నాయుడు అలా విక్టరీ సంకేతాలు చూపడం - జనాలకు అభివాదం చేయడం వంటివి చేసే వారు కాదని పరిశీలకులు అంటున్నారు.

ఏ విజయోత్సవ ర్యాలీలోనో.. అలా విక్టరీ సంకేతాలు చూపితే అదో లెక్క. ఒకవైపు కోడెల మరణంపై సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తూ - మరోవైపు అలా విజయోత్సవంలో స్పందించినట్టుగా స్పందించడంపై  సర్వత్రా విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు అలాంటి వాటిని ఆలోచించరని - తను చెప్పిందే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఆయన ఉంటారని.. విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Tags:    

Similar News