• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కోదండరాం మేధావితనం ఇదేనా?

కోదండరాం మేధావితనం ఇదేనా?

By - Tupaki Desk
Update: 2016-01-08 10:35 GMT
విభజనతో తీవ్రంగా నష్టపోయి... ఆ తరువాత కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సహాయం అందక విలవిలలాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ ఉద్యమ మేధావి - జేసేసీ ఛైర్మన్ కోదండరాం అక్కసు వెల్లగక్కారు. కేంద్రం ఆంధ్రాకు ఏదో ఎక్కువగా ఇచ్చేస్తున్నట్లుగా ఆయన మాట్లాడారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోకుండా ఆంధ్రకు సాయం చేస్తుందని మాట్లాడారు. తెలంగాణ ఆవేదన కేంద్రంలోని పెద్దలకు అర్దం కావడం లేదని...  తెలంగాణకు గత ఆరు దశాబ్దాలుగా జరిగిన అన్యాయం కంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంద్రాకు జరిగిన నష్టమే ఎక్కువ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన అబిప్రాయపడ్డారు.
    
తెలంగాణకు సంబందించిన ఒక పుస్తక ఆవిష్కరణ సభ లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఆవేదన అర్దం అయితే తప్ప డిల్లీ పెద్దలకు మన బాద ఏమిటో తెలియదని కోదండరామ్ అన్నారు.ఇందుకోసం ఇంగ్లీష్ - హిందీ భాషలలో కూడా తెలంగాణపై పుస్తకాలు రావాలని ఆయన అబిప్రాయపడ్డారు.
    
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కేసీఆర్ పట్టించుకోవడం మానేయడంతో పులుసులోకి కూడా కనిపించని కోదండరాం విభజన పూర్తయి ఆయన కోరుకున్న సొంత రాష్ట్రం తెలంగాణ ఏర్పడినా కూడా ఇంకా ఆంధ్రపై ఏడుపు మానడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లేకుంటే ఆర్థిక లోటుతో నానా ఇబ్బందులు పడుతున్న ఏపీకి కేంద్రం నుంచి సరైన సాయం అందక విలవిలలాడుతుంటే అది కూడా ఎక్కువ అన్నట్లుగా మాట్లాడడం మేధావితనం అనిపించుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు.
Tags:    
  • Kodandaram 
  • Andhra 
  • Central Govt Funds 

Similar News

ఇతరుల ఆనందమే కొలమానమా? జెన్ జెడ్ ను ఒత్తిడికి గురిచేస్తున్న సోషల్ మీడియా

2026-11-02 11:30 GMT

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

Copyright @2026

Powered by Blink CMS