కిమ్​ గొప్పలు వింటే మతిపోవాల్సిందే!

Update: 2020-09-20 17:30 GMT
‘ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్​ జాంగ్​ ఉన్​ ఐదేళ్ల వయస్సులోనే  పడవలు నడిపేవాడట. సైన్యానికి ఆదేశాలు జారీచేసేవాడట. తన తండ్రితో కలిసి మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొని చర్చలు ఆసక్తిగా  వినేవాడట’ ఇవన్నీ ఉత్తర కొరియా అధినేత జీవిత చరిత్రలోని కొన్ని అంశాలు. ప్రస్తుతం ఇటువంటి పాఠ్యాంశాలనే అక్కడి విద్యార్థులు చదవాలి. వీటిపైనే పరీక్షల్లో అడుగుతారు. రాయలేదంటే ఫెయిల్​చేసి పడేస్తారు. మళ్లీ ఆ పాఠాలు బట్టీపట్టాకే పై తరగతికి వెళ్లాల్సి ఉంటుంది. ఉత్తరకొరియా ప్రభుత్వం ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది.. కిమ్​, ఆయన పూర్వీకుల జీవితచరిత్రలను అక్కడి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని  అధినేత కిమ్​ ఆజ్ఞ.  రాజే చెప్పాక దెబ్బలకు కొదవేముంది చెప్పండి ఇక ఉపాధ్యాయలు ఉదయాన్నే పాఠాలు ప్రారంభించారు. ఈ పాఠాల్లో ఇటువంటి వింతలన్నీ వెలుగుచూస్తున్నాయి.  

కిమ్​ నిర్ణయం మేరకు ప్రాథమిక విద్యార్థుల సిలబస్‌లో పలు మార్పులు చేస్తున్నారు. అక్కడి పిల్లలు ప్రతిరోజు 90 నిమిషాలపాటు కిమ్​ జీవితచరిత్రను, పాఠ్యాంశంగా లేక పాటల రూపంలో బోధించాలి. ఈ మేరకు కిమ్‌ సోదరి కిమ్‌ యో జాంగ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్​ జాంగ్​ వీరత్వం, ఆయన పూర్వీ కుల వీరత్వాన్ని బలవంతంగా అక్కడి ప్రభుత్వం విద్యార్థుల మీద రుద్దుతోంది. అక్కడ ఎవరూ ఏమీ మాట్లాడటానికి వీళ్లేదు కాబట్టి విద్యార్థులు ఆ పాఠాలను బట్టీ పట్టే పనిలో నిమగ్నమయ్యారు.

కాగా కిమ్​ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. 2020లోనూ ఉత్తరకొరియాలో రాచరిక పాలన సాగుతోందని .. విద్యార్థులకు అవసరం లేని పనికిమాలిన విషయాలను వారిపై బలవంతంగా రుద్దుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. మరోవైపు బాలల హక్కుల సంఘాలు కూడా కిమ్​ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నాయి. కిమ్​ ప్రభుత్వం పసి హృదయాలను బానిసలుగా మార్చేందుకు యత్నిస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News