శివరాత్రి స్పెషల్: అక్కడ నో టోల్

శివరాత్రి దగ్గరకు వచ్చేసింది. శివభక్తులు ఎక్కువమంది వెళ్లాలనుకునే శైవక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. దీంతో.. భక్తుల సంఖ్య భారీగా ఉండే వీలుంది.;

Update: 2026-02-13 12:17 GMT

శివరాత్రి దగ్గరకు వచ్చేసింది. శివభక్తులు ఎక్కువమంది వెళ్లాలనుకునే శైవక్షేత్రాల్లో శ్రీశైలం ఒకటి. దీంతో.. భక్తుల సంఖ్య భారీగా ఉండే వీలుంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖతో పాటు.. అటవీశాఖ సైతం భక్తులకు రెండు శుభవార్తల్ని చెప్పారు. అందులో ముఖ్యమైనది.. శ్రీశైలం వెళ్లే వారికి రాత్రి తొమ్మిది గంటల తర్వాత వాహనాల్ని అనుమతించని వైనం తెలిసిందే. అదే సమయలో ఉదయం 6 గంటల తర్వాతే అనుమతిస్తారు. నల్లమల అడవి మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి.. ఈ నిబంధనల్ని అమలు చేస్తారు. శివరాత్రి పర్వదినం నేపథ్యంలో దీనిక సంబంధించిన కొన్ని మినహాయింపుల్ని అటవీ శాఖ ప్రకటించింది.

అందులో ముఖ్యమైనది ఈ నెల 13 నుంచి (ఈ రోజు నుంచి) పదహారు (సోమవారం) వరకు రాత్రి వేళల్లోనూ వాహనాల్ని అనుమతించనున్నారు. అంతేకాదు.. ఈ రోజుల్లో శ్రీశైలం వద్ద టోల్ రుసుముల్ని తీసుకోకుండా ఉచితంగా అనుమతిస్తారు. దీని కారణంగా పెద్ద ఎత్తున భక్తులకు మేలు కలుగుతుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా పెద్ద ఎతతున ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 2.59 లక్షల మంది భక్తులు దర్శనాలు చేసుకున్నారు. మహా శివరాత్రి రోజున 1.50 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే వీలుంది. ఈ రద్దీకి అనుగుణంగా నంద్యాల - శ్రీశైలం మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు నడిచేలా ఏర్పాట్లు చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ తరఫున 1800 బస్సులు ఏర్పాటు చేస్తే.. తలెంగా నుంచి వెయ్యి బస్సులు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులతో కలిపి మొత్తం మూడు వేల బస్సుల్ని అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News