కిమ్ వ్యాఖ్యలు: న్ల్యూక్లియర్ ఆయుధాలతో శత్రు దేశాల్లో భయం
ఎప్పుడు ఆయుధ సంపత్తిని పెంచుకోవడం.. అణ్వాస్త్రాలను ప్రయోగించడంతో ప్రపంచంలో అలజడి రేపు వ్యక్తి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జొంగ్ ఉన్. అతడు నిరంతరం యుద్ధ వాతావరణం సృష్టిస్తూ ప్రపంచాన్ని వణికించే వ్యక్తి ఇప్పుడు కొంచెం చల్లబడ్డట్టు కనిపిస్తున్నాడు. ఎందుకంటే తమ దేశంలో ఉన్న ఆయుధ సంపత్తితో శత్రు దేశాలు తమతో యుద్ధానికి దిగే పరిస్థితి లేదని.. ఇది ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొన్నారు. అణ్వస్త్రాలను కలిగి ఉన్న శక్తిమంతమైన దేశంగా ఉత్తర కొరియా ఆవిర్భవించిందని, అందుకే తమ జోలికి ఎవరూ రావట్లేదని కిమ్ జోంగ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం అణ్వాస్త్ర ఆయుధాలేనని చెప్పుకొచ్చారు.
1950-53 మధ్య కొనసాగిన కొరియన్ వార్ ముగిసి సోమవారానికి 67 సంవత్సాలు పూర్తయిన సందర్భంగా ఆ దేశ సైనికాధికారులు, కొరియన్ యుద్ధంలో పాల్గొన్న వెటరన్స్‌తో కిమ్‌జొంగ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంపై కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ కథనంలో పలు అంశాలు ఉన్నాయి. అణ్వస్త్ర రంగంలో శక్తిమంతంగా ఎదగడంతో అమెరికా కూడా తమ జోలికి రావడానికి వెనుకాడుతోందని కిమ్ పేర్కొనట్లు తెలిపింది. యుద్ధమంటూ ఏర్పడితే అణ్వస్త్రాలను వినియోగించాల్సిన అవసరం తప్పదని, అది వినాశనాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు. అణ్వాస్త్రాల వినియోగంతో విధ్వంస పరిస్థితులు ఏర్పడే ఉత్పాతం దృష్టిలో ఉంచుకుని ఏ దేశం యుద్ధానికి సన్నద్ధం కావట్లేదని తెలిపారు. దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవడానికే దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం వైపే మొగ్గు చూపుతున్నాయని సమావేశంలో కిమ్‌జొంగ్ తెలిపినట్లు కథనంలో ఉంది. సెకెండ్ కొరియన్ వార్ రాకపోవడానికి కారణం అణ్వాస్త్ర ఆయుధాలే ప్రధాన కారణమని తెలిపారు. యుద్ధాలను నివారించగలిగే శక్తి ఆ ఆయుధాలకే ఉందని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తమతో యుద్ధానికి కాలుదువ్వే ప్రయత్నం పొరుగు దేశం చేయట్లేదని దక్షిణ కొరియాను ఉద్దేశించి తెలిపారు.