కేజీ స్వీట్ రూ.16వేలు.. ఎందుకింత ధరో చెప్పే వీడియో

Update: 2022-01-07 05:04 GMT
కేజీ స్వీట్ ఎంత ఉంటుందంటే.. ఇవాల్టి రోజున మినిమం రూ.500 తక్కువగా లేని పరిస్థితి. అదే..పట్టణాలు.. చిన్న ఊళ్లలో అయితే రూ.200 - రూ.300కు లభిస్తుంది. కానీ.. నగరాల్లోని ప్రముఖ మిఠాయి షాపుల్లోకేజీ రూ.2వేల వరకు స్వీట్లు ఉన్నాయి. అయితే.. అందుకు భిన్నంగామరింత ఖరీదైన స్వీట్లను కొన్ని దుకాణాల్లో అమ్ముతున్నారు. ఆ కోవలోకే వస్తుంది ఈ స్వీటు. దీని ధర కేజీ కేవలం రూ.16వేలు మాత్రమే. ఆశ్చర్యపోతున్నారా? కానీ.. ఈ స్వీట్ లో ఏముంటుందో తెలిసిన తర్వాత.. ఆ మాత్రం ధరను డిసైడ్ చేయటంలో తప్పు లేదని ఫిక్స్ అవుతారంతే.

ఇంతకూ కేజీ మిఠాయి రూ.16వేలు పెట్టి అమ్ముతున్న స్వీట్ షాపు ఎక్కడ ఉందంటారా? అక్కడికే వస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని మౌజ్ పూర్ లో ఉన్న షాగూన్ స్వీట్ షాపులో ఈ ఖరీదైన స్వీట్ అమ్ముతున్నారు. దీని ప్రత్యేకత ఏమంటే.. ఈ మిఠాయిలో బంగారం కూడా కలిసి ఉంటుంది. బంగారాన్ని తింటారా? అంటే.. అత్యంత పలుచనైన బంగారు పేపర్లు (వీటిని తినేందుకు ఉపయోగిస్తారు) మార్కెట్లో లభిస్తాయి.

ఈ షాపులో అమ్మే కొన్ని ప్రత్యేక స్వీట్లకు బంగారు పూత పూసి.. దానిపై అసలుసిసలు కుంకమ పువ్వును ఉంచి అందంగా అలంకరిస్తారు. అందుకే.. దీనికి ఇంత ధరగా చెబుతారు. ఫుడ్ బ్లాగర్ అర్జున్ చౌహన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మిఠాయి వీడియోను షేర్చేశారు. ఒక చిన్న కుటుంబం ఈ మిఠాయిని కాస్తంత రుచి చూడాలంటే కనీసం రూ.10 వేల వరకు ఖర్చుచేయాల్సిందే. కానీ.. దీన్ని తయారు చేసిన పద్దతిని చూసిన తర్వాత.. ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుందన్నట్లుగా టెంప్టింగ్ గా ఉండటం ఈ స్వీట్ ప్రత్యేకత. మరి.. ఒకసారి టేస్ట్ చూస్తారా?




Tags:    

Similar News