• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భట్టి మాటల్ని కేసీఆర్...

భట్టి మాటల్ని కేసీఆర్ మనసులోకి తీసుకుంటారా?

By - Tupaki Desk
Update: 2020-03-14 16:30 GMT
నాకు నచ్చని ఒకే ఒక్క పదం.. అంటూ అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగు మాదిరి కాకున్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు విపక్షాలు చేసే విమర్శలు ఏ మాత్రం ఇష్టపడరు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి వారు చేసే వ్యాఖ్యలకు ఆయన కయ్యిమంటారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడతారు. ఇవన్నీ చూసినప్పుడు విపక్షాలు చెప్పేవేమీ కేసీఆర్ వినిపించుకోరన్న భావన కలగటం ఖాయం. కానీ.. కేసీఆర్ తీరును తరచి చూస్తే.. కొత్త విషయాలు కనిపిస్తాయి. పైకి కనిపించినట్లుగా తనను తప్పు పట్టినోళ్లను ఏ మాత్రం ఉపేక్షించని కేసీఆర్.. లోలోన మాత్రం వారు చెప్పే మాటల్ని సీరియస్ గా తీసుకోవటం కనిపిస్తుంది.

విపక్ష నేతల్లో ఎవరైనా ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పినా.. వారు చెప్పిన దాన్లో అర్థవంతంగా అనిపిస్తే చాలు.. వాటిని స్వీకరించటమే కాదు.. ఆ అంశాల మీద తానేం చేయాలనుకున్న విషయాల్ని చెప్పేసే తీరు ఆయనకు మాత్రమే సొంతమని చెప్పాలి. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క.. చిన్నపంచాయితీల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని.. నిధులు అందక ఇబ్బందులు పడుతుంటారని ప్రస్తావించారు.

దీన్లోని వాస్తవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ స్పందించటమే కాదు.. తమ ప్రభుత్వం ఏమేం చేయాలనుకున్న విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు. కావాలంటే ఎమ్మెల్యేల జీతాల్లో కోత పెట్టి అయినా నెలనెలా నిధులు ఇస్తానని చెప్పటం విశేషం. పంచాయితీలో ట్రాక్టర్.. ట్రాలీ.. ట్యాంకు లాంటివి కొనుగోళ్లు చేస్తే నిధులు అయిపోతాయన్న భయం వద్దన్నారు.

చిన్న పంచాయితీల పరిస్థితి ఆందోళనకరమని విపక్ష నేత భట్టి విక్రమార్క చెప్పారని.. అలాంటి వాటికి నిధుల కొరత రాకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటామని.. చిన్న పంచాయితీలకు నిధులు కొరత ఉండదని చెప్పారు. అంతేకాదు.. ప్రతి గ్రామ పంచాయితీకి రానున్న ఐదేళ్ల వ్యవధి లో రూ.40 లక్షలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలా.. తనను విమర్శించే భట్టి చేసిన సూచనలకు తానెంత ప్రాధాన్యత ఇస్తానన్న విషయాన్నికేసీఆర్ తన మాటల్లో చెప్పేశారు. అదే కేసీఆర్ ను తిరుగు లేని అధినేత గా మారుస్తుందని చెప్పక తప్పదు.
Tags:    
  • KCR Vs Bhatti Vikramarka War Of Words 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Telugu Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS