• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫాంహౌస్ కు వెళ్లిన గంటకే...

ఫాంహౌస్ కు వెళ్లిన గంటకే సిటీకి కేసీఆర్!

By - Tupaki Desk
Update: 2016-11-02 06:06 GMT
ఎర్రవల్లిలోని ఫాంహౌస్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్యనున్న అనుబంధం ఎలాంటిదన్నది తెలుగు ప్రజలకు చాలా బాగా తెలుసు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి  వచ్చిన దాని కంటే.. ఎన్నో రెట్లు ఎర్రవల్లి ఫాంహౌస్ లో గడిపారనటానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఏ మాత్రం అవకాశం లభించినా.. ఫాంహౌస్ కి వెళ్లిపోయే కేసీఆర్.. అక్కడే మూడు నాలుగు రోజుల పాటు ఉండిపోయిన వైనాన్ని మర్చిపోలేం.

అలాంటి కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. రెండు రోజలు విశ్రాంతి కోసం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆయన.. కేవలం గంట వ్యవధిలో హుటాహుటిన హైదరాబాద్ మహానగరానికి తిరిగి వచ్చేయటం పలువురిని ఆకర్షించేలా చేసింది. షెడ్యూల్ ప్రకారం రెండు రోజులు ఫాంహౌస్ లో ఉండాల్సిన కేసీఆర్.. అంత హడావుడిగా తిరిగి ఎందుకు వచ్చేసినట్లు? అన్న ప్రశ్నకు ఆరా తీస్తే.. ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు.

ఇటీవల ఏపీ – ఒడిశా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ తో పాటు.. బోపాల్ లోని జైల్లో ఉన్న సిమీ ఉగ్రవాదులు తప్పించుకున్న వ్యవహారంలో గంటల వ్యవధిలోనే ఎనిమిది మందిని ఎన్ కౌంటర్ లో హతం కావటంపై నిఘా వర్గాలు హైఅలెర్ట్ ప్రకటించాయి. అన్నింటికి మించి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధులపై మావోల గురి ఎక్కువగా ఉందని.. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజాప్రతినిధులపై దాడులకు అవకాశం ఉందన్న హెచ్చరిక జారీ అయినట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయ క్షేత్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండటం ఏ మాత్రం క్షేమకరం కాదని నిఘా వర్గాలు తేల్చి చెప్పటంతో పాటు..తెలంగాణ అధికారపక్ష నేతలంతా గ్రామాల్ని వదిలి.. సమీప పట్టణాలకు వెళ్లిపోవాలని.. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సర్కారులో కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి హరీశ్ రావును కూడా హైదరాబాద్ కు వెంటనే వచ్చేయాలని నిఘా వర్గాలు సూచన చేయటంతో ఆయన.. హుటాహుటిన నగరానికి వచ్చేయటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • KCR 
  • Farm House 
  • Security Reasons 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS