కేసీఆర్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా ?

Update: 2021-11-09 13:30 GMT
మీడియా సమావేశం లో కేసీఆర్ మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్న విషయం అర్ధమైపోతోంది. సీఎం ను తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ చేస్తుంటే కేసీఆర్ మాత్రం బండి తో పాటు కేంద్ర ప్రభుత్వం పైన కూడా మండి పడ్డారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం లో ఇదే కేసీఆర్ అండ్ కో సీమాంధ్ర పాలకులను, నేతలను నోటికొచ్చినట్లు మాట్లాడారు. సీమాంధ్ర నేతల నే కాదు తెలంగాణా ఉద్యమం లో కలసి రాని తెలంగాణా నేతలను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇళ్ళ పై దాడులు కూడా జరిగాయి.

తెలంగాణా వచ్చిన తర్వాత ఇదే విషయ మై కేసీఆర్ మాట్లాడుతు ఉద్యమం లో అదంతా ఓ భాగం గానే చూడాలి కానీ తమకు ఎవరి పైనా వ్యతిరేక భావం లేదంటు సమర్ధించుకున్నారు. మరిపుడు బండి మాట్లాడుతున్నది కూడా ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నదే కానీ తన పై వ్యక్తిగత కక్ష తో మాట్లాడుతున్నది కాదని కేసీఆర్ ఎందుకు అనుకోవటం లేదు ? ఇక్కడే కేసీఆర్ లోని ఫ్రస్ట్రేషన్ బయట పడిపోతోంది.

ఈ ఫ్రస్ట్రేషన్ కు కారణం ఏమిటంటే మొదటిది హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక లో టీఆర్ఎస్ ఓడిపోవటం. రెండో కారణం టీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో కొందరు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం ఊపందుకోవటం. ఇక మూడో కారణం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం లోకి రాబోతోందనే ప్రచారం పెరిగి పోతుండటం. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ లైఫ్ అండ్ డెత్ పద్దతిలో ప్రయత్నాలు చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినా ఈటలే గెలిచారు. దాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు.

టీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చేసి బీజేపీ లో చేరి ఉపఎన్నికలో ఈటల గెలిచినట్లే మరి కొందరు ఎంఎల్ఏలు కూడా అదే బాట పట్టే అవకాశాలున్నాయనే ప్రచారం పెరుగుతోంది. కనీసం ఏడుగురు ఎంఎల్ఏలు ఈటల తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారనే ప్రచారం కేసీఆర్ ను బాగా ఇబ్బంది పెడుతుండచ్చు. ఫైనల్ గా రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం లోకి వచ్చేస్తోందనే మౌత్ పబ్లిసిటీ పెరిగిపోతోంది. ఈ మౌత్ పబ్లిసిటీ మహా డేంజర్ గా తయారయ్యేట్లుంది. ఓ సినిమా బాగుందని ఒకళ్ళు నలుగురికి చెబితే ఆ నలుగురు సదరు సినిమాను చూసి మరో పదిమందికి చెప్పటం సహజమే.

కేవలం మౌత్ పబ్లిసిటీ తోనే హిట్ అయిన సినిమాలు ఉన్నట్లే ఇపుడు బీజేపీనే అధికారం లోకి రాబోతోందనే ప్రచారం కూడా అలాగే జరుగుతోంది. నిజంగానే బీజేపీ కి అధికారం లోకి వచ్చేంత సీనుందా లేదా అన్నది అనవసరం. అధికారం లోకి వచ్చేస్తోందనే ప్రచారమైతే జరిగి పోతోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత ఈ ప్రచారం మరింతగా పెరిగిపోయింది. దీంతోనే కేసీఆర్ లో ఫ్రస్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోతున్నట్లుంది. కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలినప్పుడల్లా ఇలా నోటికి పని చెబుతారనే విషయం మరోసారి నిరూపణైంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే .
Tags:    

Similar News