కేసీఆర్ కొత్త కేబినెట్ కులసమీకరణాలివే..

Update: 2019-02-19 05:26 GMT
తెలంగాణ కొత్త కేబినెట్ కొలువుదీరింది. రాజ్ భవన్ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో 10మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ కేబినెట్ విస్తరణకు దాదాపు రెండు నెలల సమయం తీసుకున్నారు. సామాజిక - కుల - వర్గ - ప్రాంత - జిల్లా సమీకరణాలన్నింటిని బేరీజే వేసుకొని ఎట్టకేలకు విస్తరణ చేపట్టారు.

కొత్త కేబినెట్ విస్తరణలో తన కుటుంబ సభ్యులైన హరీష్ రావు - కేటీఆర్ లకు చోటు కల్పించకపోవడం విశేషమైతే.. రెండో దఫా అధికారంలోకి వచ్చాక కూడా తొలి విస్తరణలో మహిళలను విస్మరించడం ఆయా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతిపక్షాలకు మహిళా కోటాపై ప్రశ్నించడానికి ఆస్కారం కల్పిస్తోంది.

తాజాగా తొలి కేబినెట్ విస్తరణలో నలుగురు పాత మంత్రులు ఈటెల - తలసాని - జగదీశ్ రెడ్డి - ఇంద్రకరణ్ రెడ్డిలు కొనసాగుతున్నారు. ఇక మిగిలిన వారు కొత్తవారు.. కేసీఆర్ ఈ విస్తరణలో రెడ్లకే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. మొత్తం పది మందిలో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారే కావడం విశేషం. ముగ్గురు బీసీ - ఒకరు వెలమ - ఒకరు ఎస్సీల్లోని మాల సామాజికవర్గం నేత. ఇలా కేబినెట్ విస్తరణలో కేసీఆర్ రెడ్లకే అగ్రతాంబూలం కల్పించడం చర్చనీయాంశంగా మారింది.

కొత్త మంత్రుల సామాజిక సమీకరణాలు..
1. కొప్పుల ఈశ్వర్ (ఎస్సీ-మాల)
2.జగదీశ్వర్ రెడ్డి (ఓసీ)
3. నిరంజన్ రెడ్డి(ఓసీ)
4.ప్రశాంత్ రెడ్డి (ఓసీ)
5.ఎర్రబెల్లి దయాకర్ రావు (వెలమ-ఓసీ)
6. మల్లారెడ్డి (ఓసీ)
7. ఇంద్రకరణ్ రెడ్డి (ఓసీ)
8. ఈటెల రాజేందర్ (బీసీ-ముదిరాజ్)
9. తలసాని శ్రీనివాస్ యాదవ్ (బీసీ-గొల్ల)
10. శ్రీనివాస్ గౌడ్(బీసీ-గౌడ్)
Tags:    

Similar News