ఎంఐఎంకు కేసీఆర్ ఆ గుర్తింపు ఇప్పిస్తారా!

Update: 2019-07-19 14:30 GMT
తెలంగాణలో ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేనే లేదు! ప్రజలేమో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అయితే కేసీఆర్ కాంగ్రెస్ ను విలీనం చేసేసుకున్నారు!

కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ విభాగం తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం అయిపోయింది! అలా ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. ఇదే అదునుగా తెలంగాణలో తమను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఎంఐఎం అడుగుతుండటం గమనార్హం!

ప్రస్తుతం సభలో బలాబలాలను బట్టి చూస్తే రెండో అతి పెద్ద పార్టీ ఎంఐఎం! ఉన్నది కేవలం ఏడు అసెంబ్లీ సీట్లే అయినప్పటికీ రెండో అతి పెద్ద పార్టీ మజ్లిస్సే! టీఆర్ ఎస్ ఖాతాలో వంద మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ ఖాతాలో ఉన్నది ఆరు మందే. ఏడు మందితో రెండో స్థానంలో మజ్లిస్ ఉంది.

ఈ లెక్కల ప్రకారం తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటూ మజ్లిస్ అడుగుతోంది. అయితే సభలో కనీసం పది శాతం ఎమ్మెల్యేల బలం కూడా లేకపోతే ఎవరికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదనే నియమం ఉంది. కానీ ప్రభుత్వం అనుకుంటే మజ్లిస్ ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News