ఎమ్మెల్యే కరణం బలరాంకి కరోనా పాజిటివ్ !

Update: 2020-08-04 10:30 GMT
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రోజు, రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్నాయి. దాదాపు రాష్ట్రంలోని ప్రతి  జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. స్థానిక పరిస్థితుల్ని బట్ట పలు నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛందంగా లాక్ ‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆదివారం కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి. ఇక సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతూండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .రాష్ట్రంలో ఇప్పటికే పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు.

తాజాగా ఇప్పుడు మరో ఏపీ ఎమ్మెల్యేకు కరోనా‌ నిర్థారణ అయింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా సోకిందని, దీంతో ఆయన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారని, అలాగే ఎమ్మెల్యే కరణం కుటుంబ సభ్యులతో పాటు, ఆయనతో కాంటాక్ట్‌ అయిన అందరికీ వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. దీనితో ఎమ్మెల్యే  బలరాంను ఇటీవల కలిసిన నేతలు, కార్యకర్తల్లో కూడా టెన్షన్ మొదలైంది. వారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల  ఎమ్మెల్యే కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇకపోతే , ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి,  సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులు కరోనా బారినపడ్డారు
Tags:    

Similar News