• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఓటుకు నోటు తీసుకున్నవారు...

ఓటుకు నోటు తీసుకున్నవారు ప్రశ్నించొద్దు: జేసీ

By - Tupaki Desk
Update: 2021-04-05 04:23 GMT
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సీపీఐ కాలనీలో పర్యటించిన ఆయనను సమస్యలపై ప్రజలు విన్నవించగా ఘాటుగా సమాధానమిచ్చారని ఓ వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రజలకు, జేసీకి మధ్య జరిగిన ఈ సంభాషణ సంచలనం సృష్టిస్తోంది. స్థానికులు మా కాలనీకి రోడ్డు వేయమని జేసీని కోరారు. దానికి జేసీ ‘డబ్బులు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే నేను మీకు పనులు చేయాలి.. కానీ ఎప్పుడైతే పైసలు తీసుకున్నారో మీరు అడిగే హక్కు లేదు’ అంటూ ప్రజలను ఉద్దేశించి జేసీ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

జేసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నీతి, నిజాయితీగా ఓటు వేసినప్పుడే నిలదీసే హక్కు ఉంటుందని జేసీ వ్యాఖ్యానించినట్టుగా చెబుతున్నారు. ఓటును డబ్బులకు అమ్ముకుంటే సమస్యలపై నిలదీసే హక్కు కోల్పోతారన్నారు. తాను మాట్లాడిన మాటలలో తప్పులేదని.. స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటు వేయండి.. ప్రజాప్రతినిధిని సమస్యలపై కాలర్ పట్టుకొని నిలదీసే హక్కు ఉంటుందని ప్రజలకు చెపుతున్న జేసీ వీడియో వైరల్ అయ్యింది.

ఇక  మున్సిపల్ ఎన్నికల్లో తనకు సహకరించని వాలంటీర్ హరికుమార్ పై జేసీ మండిపడ్డారు. వాలంటీర్ ఇంటిని కూల్చేస్తానంటూ బెదిరించినట్టు ప్రచారం సాగుతోంది. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్ ను ఆయన అనుచరులు లాక్కెళ్లారని సమాచారం. బాధితులుడు పోలీసులను ఆశ్రయించగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Full View
Tags:    
  • Jc Prabhakar Reddy 
  • Tadipatri Muncipal Elections 
  • Tadipatri 
  • telugu News 

Similar News

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

జగన్ బాస్...ఓడించింది బోస్ !

2026-11-04 16:15 GMT

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

Copyright @2026

Powered by Blink CMS