కొడుకు కోసం జేసీ దివాకర్ రెడ్డి పాట్లు
మనకు సాగుతున్నంత కాలం ఎదురేలేదు అని బిహేవ్ చేస్తే.. ఆ తర్వాత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు. మన టైమ్ బాగున్నప్పుడు విర్రవీగితే.. ఆ తర్వాత టైమ్ బాగోలేనప్పుడు అందరి కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పాపం జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నాడు. తన కొడుకు గెలుపు కోసం ఎక్కే మెట్టు - దిగే మెట్టుతో అల్లాడిపోతున్నాడు.
గత ఎన్నికల వరకు అనంతపురం జేసీ అడ్డా. పార్టీ ఏదైనా ఎవరు గెలవాలో డిసైడ్ చేసే సత్తా జేసీ దివాకర్ రెడ్డిది. అయితే.. తను రాజకీయాల నుంచి తప్పుకుని తన కొడుకుని అనంతపురం ఎంపీగా పోటీ చేయిస్తున్నాడు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. కొడుకు భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా సరే గెలిపించాలని తాపత్రయ పడుతున్నాడు. కానీ పరిస్థితి అందుకు అనూకూలంగా లేదు. ఇప్పుడు జేసీ వ్యతిరేక వర్గం అనంతపురం నగరంలో చాలా బలంగా ఉంది. మొన్నటివరకు ప్రభాకర్ చౌదరికి టిక్కెట్ ఇవ్వొద్దని గట్టినా పోట్లాడాడు. ఆ తర్వాత శైలజానాథ్ విషయంలో కూడా చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు. అప్పుడంటే చెల్లింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దీంతో తన కొడుకుని గెలిపించమని అందరు నేతల్ని బతిమలాడుకుంటున్నాడు జేసీ. అన్నింటికి మించి తన కొడుకు పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు అసమ్మతి అనేదే లేకుండా చూసుకుంటున్నాడు. ఇందుకోసం గుంతకల్ లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మధుసూదన్ గుప్తాతో చర్చలు కూడా జరిపారు. మరోవైపు శైలజానాథ్ కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.
అంతేకాదు ఎందుకైనా మంచిదని అనంతపురం ఎంపీగా కొడుకుతో పాటు నామినేషన్ కూడా వేశారు జేసీ దివాకర్ రెడ్డి. దురదృష్టం కొద్దీ కొడుకు నామినేషన్ తిరస్కరణకు గురైతే.. తనది పనికి వస్తుందని ఆయన అంచనా. మొత్తానికి కొడుకుని రాజకీయాల్లో సెటిల్ చెయ్యాలని జేసీ గట్టిగానే కష్టపడుతున్నారు.