• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జేసీకి మరో షాక్..సిమెంట్...

జేసీకి మరో షాక్..సిమెంట్ కంపెనీ లీజు రద్దు

By - Tupaki Desk
Update: 2020-01-31 14:20 GMT
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న టీడీపీ సీనియర్ నేత - అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నిజంగానే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడిపోతోంది. ఇప్పటికే జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని దివాకర్ ట్రావెల్స్ పై ఏపీ రవాణా శాఖ ముప్పేట దాడి చేస్తోంది. రవాణా శాఖ కొనసాగిస్తున్న దాడులతో బెంబేలెత్తిపోతున్న జేసీకి ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. జేసీకి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీ కోసం అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామంలో కేటాయించిన సున్నపురాయి గనుల లీజులను రద్దు చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. గనుల లీజును రద్దు చేయడంతోనే సరిపెట్టని జగన్ సర్కారు... ఈ గనుల్లో నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని కూడా మరింత సంచలన నిర్ణయం తీసుకుంది.

అనంతపురము జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 22బీలోని 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపురాతి గనులను జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి లీజుకిచ్చింది. ఈ గనుల్లో జేసీ కంపెనీ  38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి ఖనిజాన్ని తవ్వి తీసిందట. అయితే ఈ ఖనిజం తవ్వకాన్ని అక్రమ వ్యవహారంగా ప్రభుత్వం తేల్చేసింది. ఈ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తీయడంతో పాటుగా అక్రమంగా రవాణా చేసిందని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాకుండా నిర్దేశిత సమయంలో ఈ గనులను వినియోగించుకుని సిమెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికీ జేసీ ఫ్యామిలీ నిర్మించలేదు. ఈ నేపథ్యంలో నిర్దేశిత కాలంలో ప్లాంట్ ను నిర్మించకున్నా కూడా... జేసీ కంపెనీకి కేటాయించిన లీజులను మరో ఐదేళ్ల పాటు పొడిగింపును ఇస్తూ గత టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే జగన్ సర్కారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయా సంస్థలు, వ్యక్తులకు కేటాయించిన లీజులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ గనుల తవ్వకాలపై సీబీఐ దర్యాప్తునకు ఇప్పటికే ఓకే చెప్పేసింది. అదే క్రమంలో జేసీ కంపెనీ కూడా అక్రమంగా సున్నపురాయి ఖనిజాన్ని తవ్వి తీసి, అక్రమంగా రవాణా చేసి అమ్మేసుకుందని ఇప్పుడు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్రిషూల్ సిమెంట్ కంపెనీకి సున్నపురాయి గనులను కేటాయిస్తే.. సిమెంట్ ప్లాంట్ నే నిర్మించకుండా జేసీ ఫ్యామిలీ ఖనిజాన్ని తవ్వి తీయడంతో ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తంగా గనుల లీజును రద్దు చేయడంతో పాటుగా త్రిషూల్ కు చంద్రబాబు సర్కారు ఇచ్చిన గడువు పొడిగింపును కూడా రద్దు చేయడంతో పాటుగా అక్రమంగా ఖనిజం తవ్వడం, తరలింపుపై విచారణకు ఆదేశిస్తూ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ దెబ్బతో జేసీ మరింతగా ఇబ్బందికి గురి కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.


Tags:    
  • JC Diwakaar Reddy 
  • Cement Company 
  • Telugu NEws 

Similar News

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS