అమ్మకోసం మైసూరు ఆలయానికి భారీ కానుక!

Update: 2016-10-22 09:24 GMT
నెల రోజులకు పైగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గురించి ఆమె భక్తులు చేస్తోన్న హడావిడి అంతా ఇంతా కాదు. అమ్మపై వారికున్న అభిమానం - అంతకు మించిన ప్రేమ అద్భుతమనఏ చెప్పాలి. ఈ నెల రోజులూ అమ్మకోసం వారు చేసిన పూజలు - ఆమె ఆరోగ్యంపై వారు పడిన తపన గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. ఈ సమయంలో చిన్నా, పెద్దా అనే తారతమ్యాలూ.. ఆడా మగా అనే తేడాలు ఏమీ లేకుండా పూజలు చేశారు. ఎవరికి తోచిన స్థాయిలో వారు అమ్మపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇదే క్రమంలో అమ్మపేరున మైసూరు లోని ఆలయానికి వచ్చిన విరాళం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

అనారోగ్యం కారణంగా రోజులుగా ఆస్పత్రికే పరిమితమైపోయిన అమ్మ.. త్వరగా కోలుకోవాలని ముక్కోటి దేవతలను వేడుకుంటున్న అభిమానుళ్లో తమిళ భక్త బృదం... "కోదండ ఎస్టేట్" అని మాత్రమే చెప్పి తమ పేరూ ఊరు ఏమీ తెలపకుండా అమ్మపేరు మీద రూ.1.6కోట్ల విలువైన ఆభరణాలకు మైసూర్ లోని ఆలయానికి సమర్పించుకున్నారు. మైసూర్ శివారులోని చాముండీ హిల్స్ పైగల ఆంజనేయస్వామి, గణపతి ఆలయాలకు వచ్చిన అమ్మ అభిమానులు... స్వామివార్ల విగ్రహాలకు భారీ స్థాయిలో ఆభరణాలను ఇచ్చి వెళ్లారు.

ఈ విషయాలపై స్పందించిన ఆలయ కమిటీ ప్రతినిధులు... "ఇంత భారీ మొత్తంలో ఆభరణాలు ఇచ్చిన వారు కనీసం పేరైనా చెప్పలేదు, తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని తామీ పని చేస్తున్నామని మాత్రమే చెప్పారు" అని మీడియాకు తెలిపారు. వారి మొక్కులు ఫలించి, ఆస్పత్రి వర్గాలు ప్రకటించినట్లు, అభిమానులు ఆశిస్తున్నట్లు, భక్తులు కోర్కుంటున్నట్లు దీపావళిలోపే జయలలిత కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News