• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తిరుపతి పోటీ నుంచి...

తిరుపతి పోటీ నుంచి తప్పుకున్న జనసేన!?.. షాకింగ్ కారణం?

By - Tupaki Desk
Update: 2021-03-03 07:30 GMT
తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. త్వరలో ఇక్కడ  జరిగే ఎన్నికకు ఆయా పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నారు. అధికార వైసీపీ అనధికారికంగా గురుమూర్తి అనే అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ బాహాటంగానే పనబాక లక్ష్మీ పేరును ఖరారు చేసింది. అయితే మొదటి నుంచి బీజేపీ, జనసేనలు కలిసి ఇక్కడ తమ అభ్యర్థి అంటే.. తమ అభ్యర్థిని ప్రకటించిన నాయకులు తీరా సమయానికి సైలెంట్ గా మారిపోయారు. ఇరు పార్టీలు అభ్యర్థుల గురించి ఏమాత్రం ప్రకటన చేయడం లేదు. దీంతో తిరుపతిలోని ఇరు పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది.
 
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని ఆ పార్టీకి చెందిన నాయకులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పైకి ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం అని చెబుతున్నా దానిని అడ్డుకోవడానికి మాత్రం ఎలాంటి కసరత్తు చేయడం లేదు. దీంతో ఈ సమయంలో ఉప ఎన్నికకు వెళితే ప్రజలు తిరగబడుతారని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్టుంది. ఇక్కడి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందు తమ పార్టీ నుంచే అభ్యర్థి ఉంటారని చెప్పిన నాయకులు నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఒక్కమాట కూడా మాట్లాడడం లేదు.

అటు మొన్నటి వరకు బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ప్రస్తుతం కమలం పార్టీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అధిష్టానాన్ని కలిసిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ పై పునరాలోచించాలని కోరారు. అంతేకాకుండా తిరుపతిలో పోటీచేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అడిగారు. అయితే కేంద్రంలోని దీనిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే బెటరని పవన్ ఆలోచిస్తున్నట్లు  తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికకు దూరంగా ఉండేందుకు జనసేన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి రాకముందు.. వచ్చాక.. వైసీపీని ఆడిపోసుకున్న పవన్ ఈ మధ్య జగన్ గురించి మాట్లాడడం లేదట. దీంతో ఆయన వైసీపీకి మద్దతు ఇస్తున్నారా..? అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే పవన్ తిరుపతిలో పోటీ చేయకుంటే మాత్రం ఇదే నిజం కానుందన్న వార్తలు వస్తున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
Tags:    
  • Janasena 
  • Tirupathi By Polls 
  • Janasena Tirupathi 
  • Pawan Kalyan 
  • Telugu News 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS